Ravi Teja
Ravi Teja : ఉప్పెన మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. ఓవర్ నైట్ స్టార్డం తెచ్చుకుంది. వైష్ణవ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఆ మూవీ కృతి గ్లామర్ కుర్రాళ్లను కట్టిపడేసింది. మొదటి చిత్రమే సంచలన విజయం సాధించడంతో కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు హిట్ అందుకోవడంతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్స్ కొట్టిన హీరోయిన్ గా కృతి శెట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
Also Read : రవితేజ చేయాల్సిన సినిమాను చేసి హిట్ అందుకున్న మంచు విష్ణు…
కృతి శెట్టి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారింది. బంగార్రాజు తర్వాత కృతి శెట్టికి పరాజయాలు ఎదురయ్యాయి. అదే సమయంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీలకు ఇది ప్లస్ అయ్యింది. గ్లామర్ తో పాటు తన ఎనర్జిటిక్ డాన్సులతో శ్రీలీల దర్శక నిర్మాతలను ఆకర్షించింది. ధమాకా విజయం శ్రీలీలకు బ్రేక్ ఇచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయి. ఒక దశలో అరడజనుకు పైగా చిత్రాలకు శ్రీలీల సైన్ చేసింది. మరోవైపు కృతి శెట్టికి ప్లాప్స్ పడటం కూడా శ్రీలీల ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణమైంది.
కృతి శెట్టి తమ పాత్రలకు సరిపోతుందని భావించిన దర్శకులు శ్రీలీలను ఎంచుకోవడం ఆరంభించారు. మొత్తంగా కృతి శెట్టిని గట్టిగా దెబ్బ తీసింది శ్రీలీల. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒక్క తెలుగు మూవీ లేదు. దాంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. శ్రీలీల రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది. కాగా శ్రీలీలకు భాగ్యశ్రీ బోర్సే చెక్ పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలీల మాదిరి ఆమె వరుస చిత్రాలకు సైన్ చేస్తుంది. భారీ పాన్ ఇండియా చిత్రాలకు భాగ్యశ్రీ సైన్ చేస్తున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కింగ్డమ్ లో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్ పోతినేని లేటెస్ట్ మూవీలో ఆమెనే హీరోయిన్ అట. అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్యతో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్యకు జోడిగా భాగ్యశ్రీని వెంకీ ఎంపిక చేశారట. ప్రశాంత్ వర్మ-ప్రభాస్ కాంబోలో మూవీ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అట. కాబట్టి ఈ పరిణామాలు గమనిస్తుంటే శ్రీలీలకు భాగ్యశ్రీ ఝలక్ ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : తేజ డైరెక్షన్ లో రవితేజ చేయాల్సిన సినిమా ఎందుకు మిస్ అయింది..? ఆ సూపర్ హిట్ సినిమాను ఎవరు చేశారో తెలుసా..?
Web Title: Ravi teja heroine check srili kriti shetty
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com