Rajamouli and Mahesh babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దర్శకుల విషయంలో మాత్రం ఎవరికీ వారు వాళ్ల ప్రతిభను చూపించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తూ వరుస విజయాలను కూడా అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులందరు పాన్ ఇండియా బాట పట్టిన నేపధ్యం లో ఎవరికి వాళ్లు వాళ్ళ ప్రతిభను చూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో యావత్ సినిమా ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలతో వచ్చిన గుర్తింపును మించి ఈ సినిమాతో ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమా దర్శకులందరిలో తను కూడా ఒకడిగా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడి పక్కన తన పేరు చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతోనే రాజమౌళి ఇలాంటి ఒక భారీ సాహసాన్ని చేస్తున్నాడనే చెప్పాలి. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని ముగించుకున్న ఈ సినిమా తొందర్లోనే సెకండ్ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.
Also Read : ఒడిషా అడవుల్లోకి రాజమౌళి-మహేష్ బాబు.. ఏం జరుగుతోంది.?
ఇక మహేష్ బాబు మీద ఒక భారీ ఫైట్స్ సన్నివేశాన్ని కూడా తెరకెక్కిస్తున్నారట. ఇందులో మహేష్ బాబు నరరూప రాక్షసులను చంపే సన్నివేశాలు ఉంటాయట. దానికోసం మహేష్ బాబును ముందుగానే ఫిట్నెస్ పరంగా ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్కువ షాట్స్ ని డూప్ లేకుండా మహేష్ బాబుతోనే చిత్రీకరించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట.
తను అనుకున్నట్టుగానే ప్రతి షాట్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులు సైతం రాజమౌళి ప్రతిభను మెచ్చుకోవాలని ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.
ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడడానికి సైతం సిద్ధమయ్యాడు. ఎందుకంటే ఇతర దర్శకులతో చేసిన సినిమాలు ఒకెత్తయితే రాజమౌళితో ఒక సినిమా చేస్తే చాలు భారీ గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే మహేష్ బాబు కూడా విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
Also Read : రాజమౌళి మహేష్ బాబు ను కొత్త స్టైల్ లోకి మార్చడం వెనక ఇంత కథ ఉందా..?