Samantha: ఆశ్చర్య పరిచేలా సమంత లేటెస్ట్ లుక్… ఆ మార్పు గమనించారా?

గ్యాప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో కనిపించారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమంత లుక్ ఆకట్టుకుంది. సమంత ముఖంలో సంతోషం విరబూసింది. ఆమె ఫిట్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.

  • Written By: NARESH
  • Published On:
Samantha: ఆశ్చర్య పరిచేలా సమంత లేటెస్ట్ లుక్… ఆ మార్పు గమనించారా?

Follow us on

Samantha: సమంత రూత్ ప్రభు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమె అరుదైన మయోసైటిస్ బారిన పడ్డారు. వ్యాధి నుండి బయటపడేందుకు సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటుంది. సమంత సినిమాలకు విరామం ప్రకటించి మరీ ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఆ మధ్య అమెరికా వెళ్లిన సమంత కొన్నాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాచారం. అలాగే పలు దేశాల్లో ఆమె విహరించారు.

గ్యాప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో కనిపించారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమంత లుక్ ఆకట్టుకుంది. సమంత ముఖంలో సంతోషం విరబూసింది. ఆమె ఫిట్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. వెలిగిపోతున్న ముఖంతో చాలా అందంగా ఉంది. ఈ క్రమంలో సమంత మయోసైటిస్ మహమ్మారి నుండి బయటపడరనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇదే కామెంట్స్ చేస్తున్నారు. సమంత చాలా బ్యూటిఫుల్ గా ఉందంటున్నారు.

హైదరాబాద్ కి చెందిన ఫిట్నెస్ డైట్ ఎక్స్పర్ట్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి సమంత ఫ్రెండ్. శిల్పారెడ్డికి ఎకం అనే ఎర్లీ లెర్నింగ్ సెంటర్ ఉంది. దాన్ని విజిట్ చేసిన సమంత సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఒక పుస్తకం, ఒక పెన్, ఒక టీచర్ జీవితాన్ని మార్చేస్తాయి అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది సమంత శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. శాకుంతలం డిజాస్టర్ అయ్యింది.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సమంత కెరీర్లో భారీ ప్లాప్ గా నిలిచింది. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి ఓ మోస్తరు విజయం సాధించింది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఖుషి తెరకెక్కించారు. సమంత సిటాడెల్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. సమంత కొత్త చిత్రానికి సైన్ చేయలేదు…

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు