Samantha: సినిమాలు పక్కన పెట్టి అలా సంపాదిస్తున్న సమంత… లేటెస్ట్ హాట్ లుక్స్ వైరల్!

ఈ ప్రకటన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత… మయోసైటిస్ ప్రాణాంతకం కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాటం చేయాల్సి ఉంది.

  • Written By: Neelambaram
  • Published On:
Samantha: సినిమాలు పక్కన పెట్టి అలా సంపాదిస్తున్న సమంత… లేటెస్ట్ హాట్ లుక్స్ వైరల్!

Follow us on

Samantha: సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన సమంత మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. అనారోగ్యం కారణంగానే సమంత కొత్త చిత్రాలు ఒప్పుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. కొన్నాళ్లుగా సమంత విహారాలు చేస్తుంది. నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తూ మానసిక ప్రశాంత పొందుతుంది. అమెరికాలో సమంతకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ జరగనుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. 2022 అక్టోబర్ నెలలో సమంత తనకు మయోసైటిస్ సోకినట్టు వెల్లడించారు.

ఈ ప్రకటన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత… మయోసైటిస్ ప్రాణాంతకం కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాటం చేయాల్సి ఉంది. ఈ మహమ్మారిని జయిస్తానని నమ్మకం ఉందని ఎమోషనల్ అయ్యింది. సమంతకు చికిత్స జరుగుతూనే ఉందట. ఆమె క్రయోథెరపీ కూడా తీసుకున్నారట. గడ్డ కట్టించే చల్లని నీళ్లల్లో నిమిషాల పాటు గొంతు వరకు మునిగి ఉండాలి. దీన్ని క్రయోథెరపీ అంటారు. ఇది మయోసైటిస్ కి బెస్ట్ ట్రీట్మెంట్ అని సమాచారం.

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత సంపాదన మాత్రం వదల్లేదు. ఏదో ఒక మార్గంలో ఆమెకు కోట్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. బల్గేరి అనే జ్యువెలరీ బ్రాండ్ కి అంతర్జాతీయంగా పేరుంది. ఈ సంస్థ ఆభరణాలు ప్రమోట్ చేస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇక సమంత సైడ్ బిజినెస్ తో కూడా భారీగా ఆర్జిస్తుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ మొదలైంది.

2023లో సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదల చేసింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. ఖుషి మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఖుషి కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ సడన్ గా నెమ్మదించింది. త్వరలో సమంత-వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు చేసిన సిటాడెల్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు