Renu Desai: ప్రేమలో రేణుదేశాయ్…ఇన్ స్టా వేదికగా వెల్లడి. బ్యాయ్ ఫ్రెండ్ ఎవరంటే?

ఇటీవల కొంత కాలంగా మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు రేణుదేశాయ్. అంతేకాదు రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు.

  • Written By: Suresh
  • Published On:
Renu Desai: ప్రేమలో రేణుదేశాయ్…ఇన్ స్టా వేదికగా వెల్లడి. బ్యాయ్ ఫ్రెండ్ ఎవరంటే?

Follow us on

Renu Desai: రేణుదేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభిమానులతో వదినమ్మ గా పిలువబడిన ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యన్న సంగతి తెలిసిందే… పవన్ తో విడిపోయిన అనంతరం రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పుణేలో సెటల్ అయ్యారు… గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగానే ఉంటారు.

ఇటీవల కొంత కాలంగా మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు రేణుదేశాయ్. అంతేకాదు రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ రేణుదేశాయ్ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా కాలం తరువాత వెండితెరపై కనిపించారు రేణుదేశాయ్.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ తాజాగా విడుదలైన సూపర్ హిట్ సినిమా యానిమల్ మూవీపై స్పందించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాను ఎట్టకేలకు సినిమా చూశానన్న రేణుదేశాయ్ ఆ సినిమాతో ప్రేమలో పడినట్లు తెలిపారు. తండ్రి, కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు బావున్నాయని పేర్కొన్నారు. ఈ అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందాలనుకుంటే థియేటర్ లో మూవీ చూడాలన్న ఆమె మిస్ కావొద్దంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు