Ranveer Singh: రణ్ వీర్ సింగ్, జానీ సిన్స్.. “ఆ” యాడ్ అదిరింది

రణ్ వీర్ సింగ్.. ఈ పేరు వినిపిస్తే చాలు బాలీవుడ్ కుర్ర కారు ఎగరిగంతేస్తారు. తెర మీద మాత్రమే కాదు తెర ముందు కూడా రణ్ వీర్ సింగ్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు.

  • Written By: Suresh
  • Published On:
Ranveer Singh: రణ్ వీర్ సింగ్, జానీ సిన్స్.. “ఆ” యాడ్ అదిరింది

Follow us on

Ranveer Singh: వారిలో ఒకరేమో బాలీవుడ్ లో పేరు పొందిన నటుడు… ప్రఖ్యాత నటిమణి దీపికా పదుకొనే భర్త.. ఇంకొకరేమో హాలీవుడ్లో “పెద్దల చిత్రాల్లో” నటించే నటుడు.. పైగా అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వారిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆ ప్రకటన సోమవారం విడుదలయింది. ఇరువురూ పేరుపొందిన నటులు కావడంతో సామాజిక మాధ్యమాలలో అది చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇది మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇంతకీ ఆ వాణిజ్య ప్రకటన ఏమిటో.. అందులో నటించిన నటీనటులు ఎవరో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

రణ్ వీర్ సింగ్.. ఈ పేరు వినిపిస్తే చాలు బాలీవుడ్ కుర్ర కారు ఎగరిగంతేస్తారు. తెర మీద మాత్రమే కాదు తెర ముందు కూడా రణ్ వీర్ సింగ్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. యువతను ఆకర్షించే సినిమాలు చేయడంతో రణ్ వీర్ సింగ్ కు బాలీవుడ్ లో ప్రత్యేకమైన అభిమానులున్నారు. దీపికాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కెరియర్ మరింత జోరుగా సాగుతోంది. కేవలం సినిమాలోనే కాకుండా ఆ మధ్య ఒక మ్యాగ్జిన్ కోసం రణ్ వీర్ సింగ్ ప్రదర్శించిన ఫోజు చర్చనీయాంశమైంది. కొద్దిరోజులపాటు మీడియా కూడా దానికి సంబంధించిన వార్తతో హడావిడి చేసింది.

జానీ సిన్స్.. ఈ “పెద్దల చిత్రాల నటుడు” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పెద్దలు మాత్రమే చూసే సైట్లలో ఇతడు నటించిన చిత్రాలు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కాబట్టి.. జానీ సిన్స్ ను వారు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ రణ్ వీర్ సింగ్, జానీ సిన్స్ కలిసి బోల్డ్ కేర్ వాణిజ్య ప్రకటనలో నటించారు.. పురుషులకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తులు, “ఆ” సామర్థ్యాన్ని పెంచే ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాత్రలను ఈ సంస్థ తయారు చేసింది. వాటిని ప్రమోట్ చేసుకునే క్రమంలో భాగంగా రణ్ వీర్ సింగ్, జానీ సిన్స్ తో కలిపి ఒక ప్రకటన రూపొందించి సోమవారం విడుదల చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఈ ప్రకటన రూపొందించిన విధానం కూడా చాలా బాగుంది. ఆ ప్రకటన ఇతివృత్తాన్ని ఒక సీరియల్ తో ముడి పెట్టడం ఇంకా బాగుంది..

ఉమ్మడి కుటుంబంలో ఓ యువతీ యువకుడికి కొత్తగా పెళ్లవుతుంది. అయితే అతడి వల్ల తాను అంతర్గతంగా ఇబ్బంది పడుతున్నానని ఆ యువతి నేరుగా చెప్పేస్తుంది. ఈ మాట నచ్చని ఆ యువకుడి తల్లి ఆ యువతి ని చెంపపై కొడుతుంది. ఆమె కొట్టిన దెబ్బ తీవ్రతకు ఆ యువతి కింద పడిపోతుంటే.. రణ్ వీర్ సింగ్ వెంటనే బోల్డ్ కేర్ మాత్రను ఇస్తాడు.. ఆ యువకుడు వెంటనే నోట్లో వేసుకొని ఆ యువతీని కాపాడుతాడు. ఆ మాత్ర వేస్కోగానే అతడి సామర్థ్యం పెరిగినట్టు.. దానివల్ల ఆ యువతి సంతృప్తి పొందినట్టు ఆ ప్రకటనలో చూపించారు. ఇక ఆ యువకుడి పాత్రలో పెద్దల చిత్రాల నటుడు జానీ సిన్స్ నటించాడు.. ఇక ఈ ప్రకటన యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

కాగా, బోల్డ్ కేర్ సంస్థ తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా రణ్ వీర్ సింగ్ వ్యవహరిస్తున్నాడు. పురుషులకు సంబంధించిన షేవింగ్ క్రీమ్, షాంపూలు, బాడీ స్ప్రే, ఇతర ఉత్పత్తులను బోల్డ్ కేర్ సంస్థ తయారు చేస్తోంది. ఫాస్ట్ మూవీ కన్జ్యూమర్ గూడ్స్ విభాగం ఇండియాలో వేలకోట్ల వ్యాపారాన్ని కలిగి ఉంది. ఈ విభాగంలో జాన్సన్ అండ్ జాన్సన్, పార్లే ఆగ్రో, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి సంస్థలు కీలకంగా ఉన్నాయి. ఆ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్డ్ కేర్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే తమ సంస్థ తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా రణ్ వీర్ సింగ్ ను నియమించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు