Pawan Kalyan key campaign in Tamil Nadu : తమిళనాడులో నిర్వహించిన వన్ నేషన్ , వన్ ఎలక్షన్ సెమినార్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.పవన్ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతడికి భవిష్యత్ లేదని.. అన్నీ సర్దుకొని వెళ్లిపోతాడని అనుకున్నారు. 2024కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కీలకమైన వ్యక్తిగా మారాడు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ నే.. కీలక పాత్ర పోషించాడు.
బీజేపీ సర్కిల్స్ లో మోడీ గుర్తించడానికి కారణం ఏంటంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ కూటమి పొత్తే కారణం. అందుకే మోడీ అంత ప్రాధాన్యాన్ని పవన్ కు ఇస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ 2024 తర్వాత భారత రాజకీయాల్లో రైజింగ్ స్టార్ గా ఎదిగాడు. ఒకటి తను తీసుకున్న ఎజెండా.. ఏపీలో పోషించిన పాత్ర. టీడీపీ, బీజేపీని కలిపింది పవన్ కళ్యాణ్ నే. అదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైంది. మెజార్టీ టీడీపీ ,జనసేన, బీజేపీ ఎంపీల వల్లే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
తమిళనాడులో కూటమికి ఛరిస్మా అన్నామలై పవన్ కళ్యాణ్ లు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.