Mahanadu : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడు ప్రారంభం అయ్యింది. ఇందుకు కడప నగరం వేదిక అయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివస్తున్నారు. 250 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మహానాడు వేదికను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే తెలుగు తమ్ముళ్లకు పసందైన వంటకాలను వడ్డించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ మహానాడు లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది వినియోగించారు. తెలుగు వారికి స్వాగతం పలుకుతూ అన్న నందమూరి తారక రామారావు వాయిస్ ను పోలిన ఓ ఆడియో విజువల్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. సోషల్ మీడియాలో అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ మాటలను జతచేస్తూ.. ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న పార్టీ శ్రేణులు.. నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ వీడియోను రూపొందించారు.
Also Read : కడపలో మహానాడు.. చంద్రబాబు కీలక నిర్ణయం!
* ఆకట్టుకుంటున్న వీడియో..
సాధారణంగా నందమూరి తారకరామారావు( Nandamuri Taraka Rama Rao ) వాయిస్ లో ఒక బేస్ ఉంటుంది. దానిని గుర్తు చేస్తూ సాగింది ఈ వీడియో..’ ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగ్రత్త చేయడానికి.. నేను ప్రారంభించిన మహానాడు… నేడు తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడుకు మీ అందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జై మహానాడు, జై తెలుగుదేశం’ అని అన్నగారు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఈ వీడియోను రూపొందించారు.
* సీఎం చేతుల మీదుగా విడుదల..
సోమవారం రాత్రి ఈ వీడియోను సీఎం చంద్రబాబు( CM Chandrababu) విడుదల చేశారు. మహానాడు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, మరో మంత్రి నిమ్మల రామానాయుడు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని మహానాడు ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహానాడుకు హాజరయ్యే పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంతమంది వచ్చినా.. ఆహారంతో పాటు నీరు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎటువంటి లోటు పాట్లు రానీయ వద్దని ఆదేశించారు. అయితే మహానాడుకు సంబంధించి అన్న నందమూరి తారక రామారావు స్వయంగా పార్టీ శ్రేణులకు ఆహ్వానిస్తూ సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం
తెలుగుదేశం పార్టీ మహా పండుగ మహానాడుని విజయవంతం చేయండి.#Mahanadu2025#TeluguDesamParty#AndhraPradesh pic.twitter.com/wDAOvmV1IJ— Telugu Desam Party (@JaiTDP) May 26, 2025