Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.