Homeఎంటర్టైన్మెంట్OG 2 Update: 'ఓజీ 2' పై సంచలన అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ ఇక ఊపిరి...

OG 2 Update: ‘ఓజీ 2’ పై సంచలన అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు..

OG 2 Update: సెట్స్ మీదకు వెళ్ళక ముందే అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ 2’. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హరి హర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ని చూసి డీలాపడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 50 రోజులు తిరగకముందే ఈ చిత్రం విడుదలై భారీ […]

OG 2 Update: సెట్స్ మీదకు వెళ్ళక ముందే అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ 2’. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హరి హర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ని చూసి డీలాపడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 50 రోజులు తిరగకముందే ఈ చిత్రం విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం వాళ్లకు మామూలు కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టడం, ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ నుండే 5 మిలియన్ డాలర్ల గ్రాస్ ని వసూలు చేయడం వంటివి అప్పట్లో అభిమానులకు మామూలు కిక్ అవ్వలేదు. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ‘కాంతారా 2’ లాంటి బ్లాక్ బస్టర్ టాక్ సినిమాని తట్టుకొని , 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

హిందీ వెర్షన్ భారీ లెవెల్ లో విడుదల కాలేదు, ఒకవేళ అయ్యుంటే 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని అప్పట్లో ట్రేడ్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాకు జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ మరింత పెరిగింది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొనే , ‘ఓజీ 2’ ని గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చేయడానికి ప్రత్యేకమైన ఆసక్తి చూపడం తో , అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. నవంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుజిత్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాడు.

అయితే ఇంతలోపు పవన్ కళ్యాణ్ తన కుడి చేతికి సర్జరీ చేయించుకోవడం తో , ఈ ఏడాది ఈ సినిమా మొదలు అవ్వడం కష్టమే అని అంతా అనుకున్నారు. పైగా అక్టోబర్ 1 నుండి సుజిత్ నేచురల్ స్టార్ నాని తో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ ని మొదలు పెట్టడబోతున్నాడని, ఈ సినిమా పూర్తి అయ్యాకనే ‘ఓజీ 2’ మొదలు అవుతుందని సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట, ప్లాన్ ప్రకారమే ఈ చిత్రం షూటింగ్ ని నవంబర్ నెల నుండి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందులో ఎలాంటి మార్పు లేదట. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన యానిమేషన్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నాడట డైరెక్టర్ సుజిత్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper