Pawan Kalyan vs Ambati : పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో విజయం చేరింది. అవినీతి మంత్రిని స్వయంగా పట్టించాడు. అంబటి ఎన్ని రంకెలు వేసినా ఇంకా తప్పించుకునే అవకాశం లేకుండా ఇరికించాడు. కులం పేరుతో ఓట్లు దండుకొని.. వాళ్లకే శఠగోపం పెట్టే ఇలాంటి మంత్రి అంబటి ఎన్ని రంకెలు వేసినా నిజం నిప్పు లాంటిది.. ఎన్నటికైనా బయటపడుతుంది.
నిన్న పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి మీటింగ్ లో రెండున్నర లక్షల గురించి మాట్లాడడం వైరల్ అయ్యింది. ఇది ఏదో మాట్లారని అనుకున్నారు. పవన్ తనపై చేసిన విమర్శలకు మంత్రి అంబటి రంకెలు వేశాడు. కానీ తనపై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ సాక్ష్యముంటే చూపించాలని సవాల్ చేశాడు.. కట్ చేస్తే..
బాధితులే స్వయంగా వచ్చి మంత్రి అంబటి రాంబాబు తమ వద్ద రెండున్నర లక్షలు లంచం తీసుకున్నాడని ఓపెన్ గా చెప్పేశారు. దీంతో అంబటి రాంబాబు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక కిందామీద పడుతున్నాడు.
తన బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని ఆ బాధిత తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు. వారు లేవనెత్తిన అంశం అబద్ధమైతే ఖండించాలి. అనుమానాలుంటే నివృత్తి చేయాలి. సంబంధం లేకుంటే అదంతా అభూతకల్పనేని తేల్చాలి. కానీ అంబటి రాంబాబు మాత్రం తనకు అలవాటైన రాజకీయ దాడినే నమ్ముకున్నారు. పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో పలానా కామెంట్స్ చేశారని.. రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం ముందుందని అసందర్భ మాటలు ఆడుతున్నారు. ముందు పవన్ గురించి పక్కన పెట్టి బాధిత కుటుంబం చేసిన ఆరోపణ గురించి అంబటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అవినీతి అంబటిని పవన్ కళ్యాణ్ పట్టించిన తీరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..