Governor Quota MLCs: ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ వర్షా కాలం అసెంబ్లీ సమావేశాలు వాడావేడి వాతావరణం లో జరుగుతున్నాయి. శాసన మండలి లో అయితే మంత్రులు , విపక్ష నేతలు బూతులు తిట్టుకుంటూ కొట్లాడుకుంటున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు తన సహచర మంత్రులతో కలిసి నేడు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశం లో 57 కీలక అజండా అంశాలకు సంబంధించి మంత్రి వర్గం ఆమోదం తెల్పింది. వాటిల్లో గవర్నర్ కొత్త క్రింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీల పేర్లను కూడా మంత్రివర్గం ఆమోదం తో సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య , దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించగా , సీఎం చంద్రబాబు అందుకు ఆమోదం తెలిపారు. అయితే వీళ్లిద్దరు టీడీపీ పార్టీ కి చెందిన వాళ్ళే కావడం గమనార్హం.
కూటమి లో మూడు పార్టీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం లో ప్రధాన భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కి ఈ కోటాలో ఎలాంటి చోటు ఇవ్వకపోవడం పై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన పార్టీ శ్రేణులను శాంతింపచేయడం కోసమే, నిన్న పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రస్తుత జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కి క్యాబినెట్ హోదా ని ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ సొసైటీ ఆఫ్ గ్రీనింగ్ & రీ ఫారెస్ట్రేషన్ ఫర్ ఎచొలొగిచల్ ఎన్రిచ్మెంట్ విభాగానికి చైర్మన్ పదవి ని అప్పగించారని అంటున్నారు విశ్లేషకులు.
ఇక నేడు జరిగిన క్యాబినెట్ సమావేశం లో త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల పైన కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశంపైనే క్యాబినెట్ లో సుదీర్ఘ చర్చ సాగింది అట. బీసీలకు ఈ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని మంత్రి వర్గం ఆమోదించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 32 శాతం , పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమలు లోకి తీసుకొని రావాలని చూస్తున్నారు. ఆర్ధిక సంఘం నుండి రాష్ట్రానికి 16500 కోట్ల రూపాయిలు నిధులు మరిగిపోకుండా ఉండాలంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చెయ్యాలని మంత్రి వర్గం స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చెయ్యాలని తీర్మానించారు.