Classroom Viral Video: తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు గౌరవించాల్సింది గురువులని. ఒకప్పుడు గురువు అనే పదానికి సమాజంలో విపరీతమైన గౌరవం ఉండేది. గురువులు విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేవారు. వారిలో క్రమశిక్షణను పాదుకొల్పేవారు. తద్వారా విద్యార్థులు కూడా ఉత్తములుగా ఎదిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
సినిమాలలో చూపించినట్టుగా గురువు అనేవాడు ఒక కామెడీ పీస్ అయిపోయాడు. గురువును విద్యార్థులు లెక్కచేయడం లేదు. గురుతర బాధ్యతను గురువులు నిర్వర్తించడం లేదు. కేవలం గురువులు సమయానికి జీతం తీసుకోవడం.. వేళకు రావడం.. ఎటువంటి బాధ్యత లేకుండానే వ్యవహరించడం వంటివి ఇటీవల సాధారణంగా మారిపోయాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా గురువులను లెక్కచేయకుండా వ్యవహరించడం పెరిగిపోయింది. తద్వారా గురువులకు.. విద్యార్థులకు మధ్య ఉండాల్సిన బలమైన అవినాభావ సంబంధం దూరమైంది. పైగా కన్న పిల్లలు లాంటి విద్యార్థులతో గురువులు రకరకాల సంబంధాలు పెట్టుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అటువంటి వారి మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల తీరు మారడం లేదు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపృతంగా వైరల్ అవుతుంది. తరగతి గదిలో ఒక ప్రొఫెసర్ ముందే ఇద్దరు విద్యార్థులు లవ్ ప్రపోజల్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తన పిల్లల్ని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు విద్యాలయాలకు పంపిస్తే.. చివరికి వారు ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఇటువంటి ఆకృత్యాన్ని ఆడుకోవాల్సిన ఆధ్యాపకులు.. సహకరిస్తున్నారు. పిల్లలకు పాఠాలు అర్థం కాకపోతే.. ఉపాధ్యాయులు అర్థమయ్యేలా చెప్పాలి. దానికోసం కృత్యాలు నిర్వర్తించాలి. అలాకాకుండా విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్ కు తీసుకెళ్లాలి. వారిలో క్రమశిక్షణ నేర్పించాలి. అవసరమైతే విద్యార్థులు కష్టపడి చదివే విధంగా ప్రోత్సాహం కల్పించాలి. అలాకాకుండా లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి.. అమ్మాయిని ఎలా పడగొట్టాలి.. అమ్మాయికి ఎలా దగ్గర కావాలి అనే విషయాలను చెప్పడం నిజంగా నేటి కాలంలో ఉపాధ్యాయ వృత్తికి తీవ్రమైన కలంకం.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చకు కారణమవుతోంది. అసలు ఆ విద్యార్థులు అలా చేస్తుంటే అధ్యాపకుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు.. వారిని ఎటువైపు తీసుకెళ్తున్నాడు.. తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో విద్యాలయాలకు పంపిస్తే.. అక్కడ జరిగేది ఇటువంటి దారుణమైతే.. ఆ తల్లిదండ్రులు పడిన కష్టానికి అర్థం ఏముంటుంది.. వారి త్యాగాలకు విలువ ఏముంటుంది.. ఇప్పటికైనా అధ్యాపకులు మారాలి. విద్యార్థులు తమ తీరు మార్చుకోవాలి. లేకపోతే పవిత్రమైన విద్యాలయాలు కాస్త.. వేరే ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉంది.
క్లాస్ రూమ్ లో ప్రొఫెసర్ ముందే love proposal !
Parent’s నా బిడ్డ బాగా కష్టపడి చదువుకుంటుంది అనుకుంటారు, కాలేజీలో చేసే పనులు ఇవ్వా
BTW, ఆ professor మన ప్రెసిడెంట్ గారిలా ఉన్నారేంటి? ” pic.twitter.com/5S7Fi2O0Sy
— AVM (@AvmNews7) August 18, 2026