YouTube Ads : సాధారణంగా యూట్యూబ్ లో వీడియోలు చూస్తే యాడ్స్ తో ఇబ్బందులు పడాల్సి వస్తాయి. కొన్ని వీడియోస్ పూర్తయ్యే వరకు పదుల కొద్దీ యాడ్స్ వస్తుంటాయి. కానీ యాడ్స్ లేకుండా వీడియో కావాలంటే కొంత్ మొత్తం చెల్లించాలని యూట్యూబ్ కొన్ని సార్లు మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొందరు ఈ సౌకర్యం కోసం కొంత డబ్బు చెల్లిచి యాడ్స్ లేని వీడియోలు చూస్తారు. కానీ ఇప్పుడు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా యాడ్స్ లేని వీడియోలు చూడొచ్చు. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. ఆ అసిస్టెంట్ ఒక ఏఐ అయితే ఎలా ఉంటుంది. ఈ రెండు విషయాల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన వీడియోలతో పాటు కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు యూట్యూబ్ లో చూడొచ్చు. అయితే ఈ వీడియోలు చూసే సమయంలో మధ్యలో యాడ్స్ వస్తే చికాగు ఉంటుంది. ఇలాంటి చికాగు లేకుండా వీడియోలు చూసేందుకుPerplexityనుంచి commet అనే బ్రౌజర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా గూగూల్ ఇతర ఏ యాప్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూట్యూబ్ వీడియోలు చూస్తే ఒక్క యాడ్ కూడా రాదు. ఎలాంటి చికాగు లేకుండా వీడియోలు చూడొచ్చు.
అయితే ఇందులోనే Assistent అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. దీని ద్వారా ఎటువంటి సమాచారం అయినా.. కొన్ని ముఖ్యమైన పనులు అయినా పొందవచ్చు. మన పక్కన ఒక అసిస్టెంట్ ఉన్నట్లే.. ఇది కూడా పనిచేస్తుంది. ఉదాహరణకు ఈ ఆప్షన్ ఓపెన్ చేసి ‘నాకు జాబ్ కావాలి.. దీని కోసం రెస్యూమ్ తయారు చేసి.. అవసరమైన కంపెనీల్లో అప్లోడ్ చేయండి..’ అని సరైన విధంగా ప్రాంప్ట్ ఇస్తే.. ఆ పని మొత్తం చేసి పెడుతుంది.
ఇక నేటి కాలంలో వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వెబ్ సైట్ తప్పనిసరిగా అవసర ముంటోంది. ఇలాంటి వారికి సొంతంగా వెబ్ సైట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఈ విధంగా ఇక నుంచి యాడ్స్ లేకుండా యూట్యూబ్ చూసేవారికి, అలాగే కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి ఈ కామెట్ అనే బ్రౌజర్ ఉపయోగపడుతుంది.