Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో ఇట్టే అర్థం అవుతుంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. అందుకే ఈసారి పవన్ జన్మదిన వేడుకలను ముందస్తుగానే జరుపుకుంటున్నారు అభిమానులు. నన్ననే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దానిని ఆర్భాటంగా ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కార్యక్రమానికి భారీగా జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు తరలివచ్చారు. పవన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ముందస్తుగా ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించేందుకు అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందస్తుగా ఈ కటౌట్ ఆవిష్కరించడం ద్వారా వేడుకలపై అంచనా పెంచేశారు.
* విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద..
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సరిగ్గా అదే సమయంలో విజయవాడలో పవన్ అభిమానులు స్థానిక రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద 50 అడుగుల భారీ కటౌట్ ను ఆవిష్కరించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అభిమానులు పెద్ద ఎత్తున మొక్కల పంపిణీ చేపట్టారు. అనంతరం భారీ కటౌట్ ఆవిష్కరణ అట్టహాసం నడుమ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
* ముందస్తు వేడుకలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సెప్టెంబర్ 2న జరగనుంది. ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు అభిమానులు. సినీ అభిమానానికి తోడు రాజకీయ అభిమానం కూడా జత కలిసింది. అందుకే పవన్ జన్మదిన వేడుకలు అంటేనే ఓ రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా మెగా అభిమానులు చేసే సందడి అంతా ఇంత కాదు. మిగతా హీరోల కంటే పవన్ జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కువగా సేవా కార్యక్రమాలు కనిపిస్తాయి. కానీ విజయవాడలో భారీ కటౌట్ ఆవిష్కరించడం ద్వారా ఈ ఏడాది జన్మదిన వేడుకలు ఓ రేంజ్ లో నిర్వహిస్తామని సంకేతాలు పంపారు అభిమానులు.
View this post on Instagram