Homeఆంధ్రప్రదేశ్‌AP Investments: ఆంధ్రప్రదేశ్ కు రెండో ర్యాంక్!

AP Investments: ఆంధ్రప్రదేశ్ కు రెండో ర్యాంక్!

AP Investments: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో గణనీయంగా తన పనితీరు మెరుగుపరుచుకుంది. ప్రముఖ జాతీయ బిజినెస్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్స్ ప్రాజెక్టు టుడే నివేదికల ఆధారంగా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో జాతీయస్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. గత రెండేళ్ల వ్యవధిలో పెట్టుబడుల ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానం నుంచి.. ఏడు స్థానాలకు ఎగబాకి ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. […]

AP Investments: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో గణనీయంగా తన పనితీరు మెరుగుపరుచుకుంది. ప్రముఖ జాతీయ బిజినెస్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్స్ ప్రాజెక్టు టుడే నివేదికల ఆధారంగా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో జాతీయస్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. గత రెండేళ్ల వ్యవధిలో పెట్టుబడుల ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానం నుంచి.. ఏడు స్థానాలకు ఎగబాకి ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. ఇది నిజంగా గొప్ప విషయం. గడిచిన రెండేళ్లలో ఈ పురోగతి సాధించడం గొప్ప పరిణామం. కూటమి ప్రభుత్వానికి ఇది ఊతం ఇచ్చే విషయం.

* అప్పట్లో 9వ స్థానం..
వైసిపి 2024 వరకు అధికారంలో ఉంది. ఆ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో.. అంటే 2024 ఏప్రిల్ నాటికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ప్రభుత్వం దేశంలో తొమ్మిది వ స్థానంలో నిలిచింది. ఆ తదుపరి ఏడాది ఆర్థిక సంవత్సరంలో క్రమేపి పనితీరు మెరుత్కు పరుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా టాప్ 10 జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే ఈ గణనీయమైన పురోగతి సాధ్యమైంది.

* మహారాష్ట్ర ది ఒకటవ స్థానం..
పారిశ్రామిక పెట్టుబడులను సాధించడంలో మహారాష్ట్ర ముందంజలో కొనసాగుతోంది. ఇప్పుడు దాని తర్వాత స్థానం ఏపీ దక్కించుకోవడం విశేషం. ఇతర అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను తట్టుకొని ఈ స్థానంలో నిలబడడం అనేది గొప్ప విషయం. రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒడిస్సా 5వ స్థానంలో ఉండడం గమనించదగ్గ విషయం. అయితే పారిశ్రామికంగా ఎంతో ముందు వరుసలో ఉండే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ చాలా వేగంగా పెట్టుబడులను ఆకర్షించిందని అర్థం అవుతోంది.

* ఏపీకి ప్రత్యేక గుర్తింపు..
అయితే పెట్టుబడులను ఆకర్షించడంలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉంది. ఒకవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే.. పెట్టుబడులను ఆకర్షించడం కోసం వీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. తరచూ విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వెళ్లడం.. ఇలా చాలా రకాల ప్రయత్నాలు ఫలితమే పారిశ్రామిక పెట్టుబడుల సాధనలో రెండో స్థానం. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సిస్టం సమర్థవంతంగా పనిచేయడం వల్లే అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. తొమ్మిదవ స్థానంలో ఉన్న ఏపీని రెండో స్థానంలో నిలపడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోంది..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper