Homeలైఫ్ స్టైల్Mobile Battery Tips: మొబైల్ చార్జింగ్ కాపాడుకునే 5 టిప్స్..

Mobile Battery Tips: మొబైల్ చార్జింగ్ కాపాడుకునే 5 టిప్స్..

Mobile Battery Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది మొబైల్ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కోసారి అత్యవసరం సమయానికి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఫోన్ వాడేవారు ఎక్కువ సేపు బ్యాటరీ రావాలంటే మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకోవాలి. ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు రావడమే కాకుండా చాలా రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వీటిలో ముఖ్యమైన 5 టిప్స్ గురించి తెలుసుకుందాం.. టిప్ 1 […]

Mobile Battery Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది మొబైల్ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కోసారి అత్యవసరం సమయానికి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఫోన్ వాడేవారు ఎక్కువ సేపు బ్యాటరీ రావాలంటే మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకోవాలి. ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు రావడమే కాకుండా చాలా రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వీటిలో ముఖ్యమైన 5 టిప్స్ గురించి తెలుసుకుందాం..

టిప్ 1 : ముందుగా మీ మొబైల్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ‘డిస్ ప్లే మరియు బ్రైట్నెస్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘డార్క్ మోడ్ ’ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ఆన్ చేసుకోవాలి. దీంతో ఫోన్ బ్రైట్నెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తరువాత ‘ఆటో బ్రైట్నెస్’ ను ఆన్ చేసుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ప్రకాశవంతంగా మారుతుంది.

టిప్ 2 : చాలా మంది మొబైల్ 1 శాతానికి బ్యాటరీ లో అయ్యే వరకు చూస్తారు. ఇంకొంత మంది ఎప్పుడూ 100 శాతం ఛార్జింగ్ ఉండాలని కోరుకుంటారు. కారీ ఈ రెండూ కరెక్ట్ కాదు. బ్యాటరీ ఎప్పుడూ 20 నుంచి 80 శాతం ఉండేలా చూసుకోవాలి. ఇందులో కోసం మొబైల్ లో ‘ఆప్టిమైజ్డ్’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇది బ్యాటరీ లో అయ్యే ముందే హెచ్చరిస్తుంది. దీంతో ముందుగానే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

టిప్ 3: చాలా మంది మొబైల్ లో ఎప్పుడూ 5జీ నెట్ వర్క్ కోసం ఆటో కనెక్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకుంటారు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో 5జీ నెట్ వర్క్ కోసం సెర్చ్ చేస్తూ చార్జింగ్ ను ఖర్చు చేస్తుంది. అయితే దీనిని ఎంపికను తీసి వేస్తే ఏ ప్రాంతాల్లో ఏ నెట్ వర్క్ ఉందో.. అది మాత్రమే కనెక్ట్ అవుతుంది.

టిప్4: మొబైల్ లో ఉన్న లోకేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్లి అన్ని యాప్స్ కు లోకేషన్ పర్మిషన్ తీసేయండి. ఇక్కడ అన్నింటికి పర్మిషన్ ఉంటే ‘అలో ఆల్ ద టైమ్’ అని ఉంటుంది. దీనిని తీసివేసి ‘అవసరం ఉన్నప్పుడు మాత్రమే అలో చేయండి’ అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా చార్జింగ్ తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

టిప్ 5: కొన్ని యాప్స్ కు బ్యాటరీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఆ యాప్ అవసరం లేనప్పుడు లేదా ఎక్కువగా యూజ్ చేయనప్పుడు దానిని తీసివేయడమే బెటర్. దీని కోసం ‘బ్యాక్రౌండ్ యాక్టివిటీ యాప్ ఫ్రెష్’ అనే సెట్టింగ్స్ ను మీకు అనుగుణంగా మార్చుకోవాలి.

ఈ విధంగా మీ మొబైల్ చార్జింగ్ త్వరగా అయిపోకుండా కాపాడుకోవచ్చు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఫోన్ ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలో ఉండడం, అధికంగా గేమ్స్ ఆడడం వంటి వాటి వల్ల కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి వాటి విషయంలో పరిమితంగా ఉండాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper