Sheela Kaur: కొంతమంది హీరోయిన్స్ అందంగా ఉంటారు , అద్భుతంగా నటిస్తారు , వాళ్ళ కెరీర్ లో సూపర్ హిట్స్ కూడా ఉంటాయి. కానీ అకస్మాత్తుగా వాళ్లకు ఏమవుద్దో ఏంటో తెలియదు కానీ , ఇండస్ట్రీ నుండి మాయం అయిపోతుంటారు. కానీ అప్పుడప్పుడు టీవీ లో వాళ్లకు సంబంధించిన సినిమాలు చూసినప్పుడు ‘అమ్మాయి చాలా బాగుంటుంది.. ఏమైందో ఈ మధ్య సినిమాలు చేయడం లేదు’ అని మనం మాట్లాడుకున్న సందర్భాలు చాలానే ఉండుంటాయి. అలా ఇండస్ట్రీ లో మంచి సూపర్ హిట్స్ ని అందుకొని , అదే కెరీర్ ని ముందుకు సాగించకుండా సినిమాలకు దూరమైన హీరోయిన్ షీలా కౌర్. ఈమె మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు , ఒక తమిళ హీరోయిన్. అక్కడ దాదాపుగా 10 సినిమాల్లో నటించిన తర్వాత , కొంత గ్యాప్ తీసుకొని 2006 వ సంవత్సరం లో ‘సీతాకోక చిలుక’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వలేదు, ఆ తర్వాత ఆమె మంచు మనోజ్ తో చేసిన ‘రాజు భాయ్’ కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అదే విధంగా 2007 వ సంవత్సరం లో విడుదలైన ‘హలో ప్రేమిస్తారా’ అనే చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ తర్వాత ఆమె చేసిన ‘పరుగు’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా మస్కా, అదుర్స్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు , కెరీర్ కి 2011 లోనే బ్రేక్ ఇచ్చింది. 2018 లో ‘హైపర్’ అనే కన్నడ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ మాయమైంది.
ఇక ఈమె వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమె 2020 వ సంవత్సరం లో చెన్నై కి చెందిన సంతోష్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడింది. అప్పటి నుండి సాధారణ గృహిణి గా తన పనులు తాను చేసుకుంటూ మీడియా కి దూరంగా ఉంటూ వస్తోంది షీలా. కానీ సోషల్ మీడియా లో మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది. ఈ ఏడాది మార్చ్ నెలలో ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోతారు. కెరీర్ ప్రారంభం ఎలా అయితే ఉన్నిందో , ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే , అప్పటికంటే ఇప్పుడే బాగా అందంగా తయారైంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram