India Happiness: మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందని కొందరు అంటుంటారు. డబ్బు లేకపోతే రోజు గడవని పరిస్థితి. అయితే ఒక మనిషి బతకడానికి ఎంత డబ్బు అవసరం? చేతిలో ఎంత డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటారు? అంటే ఎవరు చెబుతారు? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి లేదా కుటుంబ సంతోషంగా ఉండడానికి డబ్బు మాత్రమే కాదు. మరిన్ని కావాలి. అవేంటో చూద్దాం..
2026 వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ లో భారత్ కు 116వ స్థానం వచ్చింది. గ్యాలప్ వరల్డ్ పోల్ ను భట్టి చూస్తే భారత్ లో హ్యాపీ లైఫ్ కోసం 4.53 స్కోరు వచ్చింది. అంటే దీనిని భట్టి భారత్ లో ఎంతమంది సంతోషంగా ఉన్నారని అంచనా వేయలేం. ఎందుకంటే చాలా మంది పైకి సంతోషంగా ఉన్నామని చెబుతున్నా.. లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా చాల మంది జీవిత పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
అయితే చిన్న కుటుంబంను ఉదాహరణగా తీసుకుంటే.. ఆ కుటుంబానికి నెలకు రూ.50 నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వస్తుందని అనుకుందాం. ఇందులో వీరి అవసరాలు తీరాకా.. కాస్త డబ్బు సేవ్ చేస్తే హ్యపీ అని కొందరు అంటుంటారు. కానీ అనుకోని పరిస్థితులు.. ఖర్చుల పెరుగుదల.. వైద్య ఖర్చులు తోడైతే.. ఈ మొత్తం కూడా సరిపోయే అవకాశం ఉండదు. అయితే నెలకు ఇంతకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు కూడా సంతోషంగా ఉంటారు. అందుకు వారికి కోరికలు లేకపోవడమే.
కొంతమందికి తక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆదాయం పెరిగినా.. అదే బాధతో ఉంటారు. అందుకు కారణం ఆదాయం పాటు అవసరాలు, కోరికలు పెరగడం. మరి అవసరాలు, కోరికలు తగ్గించుకుంటామా? అంటే చెప్పలేం. కొందరు వీటిని కంట్రోల్ చేసుకుంటారు.మరికొందరు మాత్రం జీవితాన్ని అన్ని విధాలుగా అనుభవించాలి.. అన్న ధోరణితో ఉంటారు.
నేటి కాలంలో సొంత ఇల్లు కావాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ కోరిక కలిగినట్లయితే ఆ ఇల్లు ఈఎంఐ పూర్తయ్యే దాకా.. సంతోషంగా ఉంటున్నారని అనలేం. అలాగని సొంత ఇల్లు లేకపోతే అద్దె సమస్యలు ఉంటాయి. కొందరికి ఒక ఆదాయంతో సరిపెట్టుకుంటారు. మరికొందరికి రెండు ఆదాయాలు వచ్చినా.. ఎప్పుడూ టెన్షన్ తో ఉంటుంటారు.
ఈ విధంగా ఎవరు హ్యాపీగా ఉంటారు? అన్న అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ప్రతీ కుటుంబంలో వారి పరిస్థితులు, అవసరాలు, కోరికలు, ఆదాయాన్ని భట్టి వారు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది మాత్రం చెప్పొచ్చు.