Homeఆంధ్రప్రదేశ్‌Bogapuram Airport: భోగాపురంలో బాదుడు..ఏంటీ కొత్త పంచాయితీ.. వైరల్ వీడియో

Bogapuram Airport: భోగాపురంలో బాదుడు..ఏంటీ కొత్త పంచాయితీ.. వైరల్ వీడియో

Bogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. నిన్నటి నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభం కాగా.. తొలిరోజు 26 విమాన సర్వీసులు నడిచాయి. అయితే తొలి రోజు ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. విశాఖ నగరం నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సులు నడిచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పైగా భోగాపురంలో ఆర్టీసీ […]

Bogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. నిన్నటి నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభం కాగా.. తొలిరోజు 26 విమాన సర్వీసులు నడిచాయి. అయితే తొలి రోజు ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. విశాఖ నగరం నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సులు నడిచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పైగా భోగాపురంలో ఆర్టీసీ బస్సులను ఆపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయలేదు. ఇంకోవైపు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో చార్జీల బాదుడు అధికంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కమర్షియల్ వెహికల్ ఎంట్రీ, వెయిటింగ్ పేరుతో భారీగా చార్జీలు వసూలు చేస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. ఒక డ్రైవర్ విమానాశ్రయం సిబ్బందిని నిలదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

* ఇరువర్గాల మధ్య వివాదం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను తీసుకొచ్చాడు ఓ క్యాబ్ డ్రైవర్. అయితే ఆ డ్రైవర్ నుంచి సిబ్బంది ఏకంగా 600 రూపాయల కమర్షియల్ టాక్స్, వెయిటింగ్ ఛార్జ్ డిమాండ్ చేయడంతో డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రయాణికులను విమానాశ్రయంలో దించేందుకు 700 రూపాయలు తీసుకున్నానని.. కానీ విమానాశ్రయం లోపలికి ప్రవేశించగానే 600 రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించాడు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదని.. నిబంధనల పేరుతో క్యాబ్ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

* డిస్ప్లే బోర్డు లోను అధికం..
వాస్తవానికి విమానాశ్రయం డిస్ప్లే బోర్డు పై పొందుపరిచిన పార్కింగ్, వెయిటింగ్ ఫీజుల ను మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ డిస్ప్లేలో సైతం భారీగా చార్జీలు కనిపిస్తున్నాయి. అయితే తాము చెప్పినట్టుగా 600 రూపాయలు ఇవ్వాల్సిందేనని ఎయిర్పోర్ట్ సిబ్బంది డిమాండ్ చేయగా.. సదరు డ్రైవర్ మాత్రం ఇచ్చేందుకు అంగీకరించలేదు. తనకు న్యాయం జరిగే వరకు కారును ఇక్కడి నుంచి కదిలించేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పాలంటూ పట్టుపట్టాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గట్టి వాదన జరిగింది. పక్కనున్న వారు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper