Nagababu: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబు కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ లో హోదా కల్పించింది. ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ పర్యావరణ , అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మైన్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తూ , కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జనసేన శ్రేణుల్లో కొంతమంది సంతోషం వ్యక్తం చేయగా, మరికొంత మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు కి MLC పదవి ఇస్తూ , త్వరలోనే మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కేవలం క్యాబినెట్ ర్యాంక్ కి మాత్రమే పరిమితం చేసింది. కూటమి లో జనసేన పార్టీ కి అన్యాయాల పర్వం కొనసాగుతూనే ఉందని, ఇలా అయితే మనుగడ కష్టం అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగబాబు 2024 వ సంవత్సరం లో అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చెయ్యాలని అనుకున్నాడు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని , ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టాడు. కానీ కూటమి లో బీజేపీ పార్టీ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసాడు నాగబాబు. అయితే పవన్ కళ్యాణ్ ఆయనకు MLC పదవి ఇప్పించి , తద్వారా మంత్రిని చెయ్యాలని అనుకున్నాడు. ప్రభుత్వం అందుకు అంగీకారం కూడా తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ చివరికి క్యాబినెట్ ర్యాంక్ పదవితో సరిపెట్టింది. మరి ఈ విషయం పై నాగబాబు సంతృప్తి గా ఉన్నాడా లేదా?, ఇంతకీ పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి?, ఆయనతో ముందుగానే చర్చించి ఈ పదవి ని ప్రకటించారా ?, లేదా నేరుగా ప్రకటించారా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే నాగబాబు ఈ పదవి దక్కినందుకు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఇకపోతే నేటి నుండి అమరావతి లో అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి అసెంబ్లీ సమావేశానికి హాజరు అవ్వలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం తో సీఎం చంద్రబాబు కూడా హాజరు అవ్వలేదు. మరో పక్క శాసనమండలి లో నాగబాబు హాజరయ్యాడు. మంత్రుల , ప్రతిపక్షం మధ్య DSC అంశం లో వాడావేది చర్చలు జరుగుతున్నాయి.