Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరో గా పనికి రాడని చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్...పవర్ స్టార్...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరో గా పనికి రాడని చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్…పవర్ స్టార్ ఏం చేశాడంటే…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. నిజానికి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను టచ్ చేసి హీరో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేద్దామని చిరంజీవి అనుకున్న సందర్భంలో ఒక ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ […]

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. నిజానికి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను టచ్ చేసి హీరో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేద్దామని చిరంజీవి అనుకున్న సందర్భంలో ఒక ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ ని చూసి అతను సినిమాలకి పనికి రాడు అని చెప్పారట. కారణమేంటి అంటే మొదట్లో పవన్ కళ్యాణ్ కి సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఈ విషయాన్ని పదేపదే ఆయన అందరితో చెబుతూ ఉండేవారట. అయినప్పటికి చిరంజీవి మాత్రం పట్టు బట్టి నువ్వు సినిమాల్లోకి రావాలి హీరో అవ్వాలని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది.

చిరంజీవి ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చాడు. కాబట్టి తన అన్నకు తనవల్ల బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనుకోని పవన్ కళ్యాణ్ హీరోగా రాణించడానికి విపరీతంగా కష్టపడ్డాడు. మొదటి సినిమా ఆశించిన మేరకు ఆడకపోయిన కూడా ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఆయన తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ అనే బిరుదును పొందడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా పనికి రాడని చెప్పిన ప్రొడ్యూసర్ ఎవరనే విషయం అయితే బయట ఎక్కడ చెప్పడం లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పేశాడు.

మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే మాత్రం అది ఖచ్చితంగా చేసి చూపించగలిగే ఒక ధృడమైన లక్షణం ఉంది. ఇక దాని కోసమైనా ఆయన కష్టపడి మరి హీరోగా మారి టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ వచ్చి పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్నాడట. ఏదేమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper