Bro Trailer: ఒక పవన్ కళ్యాణ్ కాదు.. ఏకంగా నలుగురు.. ‘బ్రో’ ట్రైలర్ లో మీరు గమనించని విషయాలు!

‘బ్రో ది అవతార్’ చిత్రం లో డ్యూయల్ రోల్ కాదు, ఏకంగా నలుగురు  పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ మీద కనిపిస్తారని అంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ గెటప్, ఆఫీస్ లోపల రిసెప్షనిస్ట్ గా, సోడా బుడ్డి కళ్ళజోడు గెటప్ లో కనిపించడం మన అందరం గమనించే ఉంటాము.

  • Written By: Vicky
  • Published On:
Bro Trailer: ఒక పవన్ కళ్యాణ్ కాదు.. ఏకంగా నలుగురు.. ‘బ్రో’ ట్రైలర్ లో మీరు గమనించని విషయాలు!

Follow us on

Bro Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది  అవతార్’ వచ్చే వారం విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న సాయంత్రం విడుదల చెయ్యగా, దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని ఎనెర్జిటిక్ ఎంటర్టైన్మెంట్ రోల్ లో చూసేసరికి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో సంతోషించారు.

కచ్చితంగా ఈ చిత్రం నాన్ రాజమౌళి రికార్డ్స్ మొత్తం బద్దలు కొడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ లో కనిపించలేదు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. డ్యూయల్ రోల్ అంటే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు పవన్ కళ్యాణ్ లు , అలా అన్నమాట.

కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రం లో డ్యూయల్ రోల్ కాదు, ఏకంగా నలుగురు  పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ మీద కనిపిస్తారని అంటున్నారు. నిన్న చూపించిన ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ గెటప్ లో కనిపించింది మన అందరం గమనించే ఉంటాము. అయితే ఇదే ఫ్రేమ్ లో ఆయన ఆఫీస్ లోపల రిసెప్షనిస్ట్ గా కూడా కూర్చొని ఉంటాడు. సోడా బుడ్డి కళ్ళజోడు గెటప్ లో కనిపించడం మన అందరం గమనించే ఉంటాము.

ఈ సన్నివేశం మొత్తం లో పవన్ కళ్యాణ్ నాలుగు విభిన్నమైన గెటప్స్ తో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాడట. కచ్చితంగా ఇది ఫ్యాన్స్ కి కనుల పండుగ లాగానే ఉంటుంది. పూర్తి స్థాయి లో కాకపోయినా కాసేపు అయినా అలా పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు అని అబ్భిమానులు అనుకుంటున్నారు. చూడాలి మరి థియేటర్స్ లో ఈ సన్నివేశం కి రెస్పాన్స్ ఏ రేంజ్ లో వస్తుంది అనేది.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు