HomeNewsSudigali Sudheer: సుడిగాలి సుధీర్ ని దారుణంగా అవమానించిన యంగ్ హీరోయిన్..ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా...

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ని దారుణంగా అవమానించిన యంగ్ హీరోయిన్..ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

Sudigali Sudheer: జబర్దస్త్ షో తో మొదలైన సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రస్థానం ఇప్పుడు ఆయన్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా స్థిరపడిన మీడియం రేంజ్ మార్కెట్ హీరో కి ఎంతటి క్రేజ్ , ఫాలోయింగ్ ఉంటుందో, సుడిగాలి సుధీర్ కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర నుండి వెండితెర కి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు, కానీ ఈమధ్య కాలంలో ఒక్కరు కూడా […]

Sudigali Sudheer: జబర్దస్త్ షో తో మొదలైన సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రస్థానం ఇప్పుడు ఆయన్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా స్థిరపడిన మీడియం రేంజ్ మార్కెట్ హీరో కి ఎంతటి క్రేజ్ , ఫాలోయింగ్ ఉంటుందో, సుడిగాలి సుధీర్ కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర నుండి వెండితెర కి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు, కానీ ఈమధ్య కాలంలో ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ సుడిగాలి సుధీర్ కి మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన హీరో గా నటించిన ‘గాలోడు’ చిత్రం కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నుండి ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు. ముఖ్యంగా ఆయన హీరో గా నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ కూడా విడుదల అవ్వలేదు.

నిర్మాతతో సుధీర్ కి కొన్ని సమస్యలు , విబేధాలు ఉండడం వల్ల , ఈ సినిమా ఇన్ని రోజులు విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన పట్టు వీడాడు. నిర్మాతకు సహకరిస్తున్నాడు , త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి హైప్ ఉండేది. ‘అయ్యో పాపం సారూ’ అనే పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో క్రియేట్ అయిన హైప్ ఊపులో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే పెద్ద హిట్ అయ్యేది. కానీ అది జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా హీరోయిన్ దివ్య భారతి నిర్మాత తో కలిసి పలు ఈవెంట్స్ లో పాల్గొన్నది. ఆమె సుడిగాలి సుధీర్ పై డైరెక్ట్ గానే విమర్శలు చేసింది. ఈ చిత్ర దర్శకుడు నన్ను అవమానిస్తుంటే సుధీర్ అలా చూస్తూ ఉండిపోయాడు కానీ , కనీస స్థాయిలో కూడా స్పందించలేదు.

ఈ సినిమాకు హీరో ఆయనే , కానీ అసలు పట్టించుకోవడం లేదు , నిర్మాతని ఇబ్బంది పెడుతున్నాడు వంటి వ్యాఖ్యలు ఒక ఈవెంట్ లో చేసింది. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మా సుధీర్ నే అంత మాట అంటావా?, ఆయన క్యారెక్టర్ గోల్డ్ , తప్పు మీ వైపే ఉంది అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేశారు. దివ్య భారతి ఇన్ని రోజులు అభిమానుల కామెంట్స్ కి రియాక్షన్ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు అడ్డంకులన్నీ దాటుకొని విడుదలకు ఈ చిత్రం సిద్ధం అవ్వగా, సుడిగాలి సుధీర్ కూడా నిర్మాతకు సహకరిస్తూ ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి అంగీకారం తెలిపాడు. రీసెంట్ గానే హీరోయిన్ దివ్య భారతి తో కలిసి సుధీర్ కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. మా సుధీర్ అన్నయ్య ని అనవసరంగా ఈవెంట్స్ లో అవమానించావు, కానీ ఆయన అసలు మనస్తత్వం ఇది, మీరెన్ని కామెంట్స్ చేసినా మనసులో పెట్టుకోకుండా ఆయన మీతో కలిసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు , ఇంకెప్పుడు కూడా ఇలా తొందరపడి కామెంట్స్ చేయొద్దు అంటూ సోషల్ మీడియా లో సుధీర్ అభిమానులు దివ్య భారతి ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper