Kia Seltos: కారు కొనాలి అనుకునేవారు కేవలం బ్రాండ్ ను మాత్రమే చూడరు. తమ బడ్జెట్ కు తగ్గట్టుగా ఎలాంటి ఫీచర్లు వస్తున్నాయి.. భద్రత ఎలా ఉంది.. మైలేజ్ ఎంత వస్తుంది.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉందా.. వంటి విషయాలను కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా 15 లక్షల నుంచి 20 లక్షల బడ్జెట్ లో ఎస్ యూవీ కొనాలి అనుకునే వారికి Kia Seltos మంచి ఎంపిక. సెల్టోస్ లో బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ మోడల్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ ఫీచర్లు, ధరలు వేరువేరుగా ఉన్నాయి. వీటిల్లో HTK(O) వేరియంట్ సమతుల్యమైన ఎంపిక లాగా కనిపిస్తోంది.
HTK (O) ఫీచర్ల విషయంలో తగ్గేదే లేదు
- కియా సెల్టోస్ HTK(O) వేరియంట్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
- పనో రమిక్ సన్ రూఫ్ ఉంటుంది.
- 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫో టైం మెంట్ సిస్టం ఉంటుంది
- వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో.. ఆపిల్ కార్ ప్లే
- వైర్లెస్ ఫోన్ చార్జర్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (ఆటోమేటిక్ వేరియంట్ లో ఉంటుంది)
- 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ (ఆటోమేటిక్ వేరియంట్ లో ఉంటుంది)
- కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ లాంప్స్ ఉంటాయి
- పుష్ బటన్ స్టార్ట్
- ఆటో ఫోల్డింగ్ ORVM లు ఇందులో ఉంటాయి.
- ఫ్రంట్.. రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.
ముఖ్యంగా పనోరమిక్ సన్ రూఫ్.. వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు సాధారణంగా ఖరీదైనంగా వేరియంట్ లో కనిపిస్తాయి. కానీ HTK(O) లో వీటిని పొందవచ్చు. ఈ మోడల్ కార్లో 1.5 లీటర్ పెట్రోల్.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్.. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉంటాయి. గేర్ బాక్స్ విషయానికి వస్తే పెట్రోల్ ఇంజన్ కు సిక్స్ స్పీడ్ మాన్యువల్.. సివిటి ఆప్షన్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్ కు ఐఎంటి 7 స్పీడ్ డిసిటి.. డీజిల్ కు మాన్యువల్.. ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లు ఉన్నాయి. మాన్యువల్ కారు కావాలన్నా.. ఆటోమెటిక్ కారు కావాలన్నా.. పెట్రోల్ లేదా డీజిల్ కారు కావాలన్నా ఈ వేరియంట్ లో ఎంపిక చేసుకోవచ్చు. HTK(O) ధర.. ఇంజన్.. గేర్ బాక్స్ ను బట్టి మారుతుంది. ఇందులో పెట్రోల్ మాన్యువల్ 16.85 లక్షలు, పెట్రోల్ సిబిటి 18.36 లక్షలు, టర్బో పెట్రోల్ ఐఎంటి 17.76 లక్షలు, టర్బో పెట్రోల్ డీసిటీ 19.25 లక్షలు, డీజిల్ మాన్యువల్ 19.13 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్ 20.67 లక్షల ధర ఉంది.
కియా సెల్టోస్ లో అన్ని ఫీచర్లు కావాలంటే టాప్ వేరియంట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పనోరమిక్ సన్ రూఫ్.. మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.. భద్రత ఫీచర్లు.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ వంటి సౌకర్యాలు ఒకే వేరియెంట్లో కావాలి అనుకునే వారికి HTK(O) మంచి ఎంపిక.