Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్.. వర్కౌట్ అయ్యేలా ఉంది..

Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్.. వర్కౌట్ అయ్యేలా ఉంది..

Sudigali Sudheer: స్మాల్ స్క్రీన్ మీద తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుడిగాలి సుధీర్.. హీరోగా వెండితెర మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం GOAT.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళ హీరోయిన్ దివ్యభారతి ఇందులో కథానాయక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉండడంతో ఆసక్తిని పెంచుతుంది. ఒక కిడ్నాప్ చుట్టూ తిరిగే కామెడీ కథతో ఈ సినిమా తీసినట్టు తెలుస్తోంది. సుధీర్ […]

Sudigali Sudheer: స్మాల్ స్క్రీన్ మీద తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుడిగాలి సుధీర్.. హీరోగా వెండితెర మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం GOAT.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళ హీరోయిన్ దివ్యభారతి ఇందులో కథానాయక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉండడంతో ఆసక్తిని పెంచుతుంది.

ఒక కిడ్నాప్ చుట్టూ తిరిగే కామెడీ కథతో ఈ సినిమా తీసినట్టు తెలుస్తోంది. సుధీర్ తన బృందంతో కలిసి ఒక యువతని కిడ్నాప్ చేయడం.. ఆమె కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించడం.. దాని చుట్టూ జూదం.. శక్తివంతమైన విలన్.. ఫైట్లు.. కామెడీ.. ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.. సుధీర్ మాస్ అవతారంలో కనిపించారు. ఇటువంటి పాత్రలు సుధీర్ కు ఇంత వరకూ పడలేదు. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా సుధీర్ తన పాత్రను చాలా ఈజ్ తో చేసినట్టు కనిపిస్తోంది. రొమాంటిక్ సన్నివేశాలు కూడా దండిగానే ఉన్నట్టు తెలుస్తోంది.

సుధీర్ కు కామెడీ కొత్త కాదు. ఈ ట్రైలర్లో వన్ లైనర్ పంచ్ లు చాలా ఉన్నాయి. ఇందులో కూడా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దివ్య భారతి కూడా కథలో కీలకంగా కనిపిస్తోంది. గ్లామర్ తో పాటు ఆమె కు నటనకు స్కోప్ ఉన్న పాత్ర పాడినట్టు తెలుస్తోంది. సుధీర్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఇందులో ఆసక్తిని కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి.. ట్రైలర్ అయితే మోస్ట్ ప్రామిసింగ్ లాగానే ఉంది. అయితే ఇందులో కనిపించే వినోదాన్ని.. సస్పెన్స్ ను సినిమా మొత్తం కొనసాగిస్తే తిరుగు ఉండదు.

ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైంది. మధ్యలో దర్శకుడికి.. నిర్మాతకు వివాదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులు సుధీర్ కూడా ఈ సినిమా విషయంలో అంటి ముట్టనట్టు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆమధ్య ఈ సినిమాలో నటించిన దివ్యభారతి కూడా సుధీర్ మీద విమర్శలు చేసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి అన్ని తొలగిపోయి.. సినిమా విడుదలకు సిద్ధమైనట్టు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్లో జెన్ జెడ్ ఆడియన్స్ ఇష్టపడే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పైగా సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా సరే.. నిర్మాతకు కాసుల పంట పండినట్టే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper