Homeబిజినెస్Tata Punch: ఈ ఐదు లక్షల కారు దెబ్బకు టాప్ బ్రాండ్ల కు షాక్.. ఇండియాలో...

Tata Punch: ఈ ఐదు లక్షల కారు దెబ్బకు టాప్ బ్రాండ్ల కు షాక్.. ఇండియాలో నెంబర్ వన్ SUV ఇదే..

Tata Punch: కారు కొనాలంటే కనీసం 10 లక్షలు ఖర్చు చేయాల్సిందేనా.. మంచి SUV కావాలంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందేనా.. ఈ ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ తక్కువ ధరలో ఎస్ యు వి లుక్.. మంచి ఫీచర్లు.. సెక్యూరిటీస్ ఆధ్వర్యంలో అందిస్తే కస్టమర్లు ఎలాగైనా కొనుగోలు చేస్తారని టాటా పంచ్ నిరూపించింది. భారత ఆటో మొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి.. హ్యుందాయ్.. మహీంద్రా.. తియాబట్టి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న మోడల్ గా టాటా […]

Tata Punch: కారు కొనాలంటే కనీసం 10 లక్షలు ఖర్చు చేయాల్సిందేనా.. మంచి SUV కావాలంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందేనా.. ఈ ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ తక్కువ ధరలో ఎస్ యు వి లుక్.. మంచి ఫీచర్లు.. సెక్యూరిటీస్ ఆధ్వర్యంలో అందిస్తే కస్టమర్లు ఎలాగైనా కొనుగోలు చేస్తారని టాటా పంచ్ నిరూపించింది.

భారత ఆటో మొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి.. హ్యుందాయ్.. మహీంద్రా.. తియాబట్టి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న మోడల్ గా టాటా పంచ్ నిలిచింది. ముఖ్యంగా అందుబాటు ధర.. కాంపాక్ట్ డిజైన్.. పెట్రోల్.. సిఎన్జి.. ఎలక్ట్రిక్ ఆప్షన్లతో ఈ కారు ఆకట్టుకుంటున్నది..

టాటా పంచ్ ప్రారంభంలోనే బడ్జెట్ ఎస్ యూవీ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం అప్డేట్ వెర్షన్ ప్రారంభ ధర సుమారు 5.75 లక్షల నుంచి ఉంటుంది. వేరియంట్ ను బట్టి ధర మారుతూ ఉంటుంది. టాటా పంచ్ చూసేందుకు చిన్న కారు లాగా ఉన్నప్పటికీ.. ఎస్ యు వి తరహాలో డిజైన్ ఉంది. 2026 పేస్ లిస్టులో మరింత ఆధునిక రూపాన్ని తీసుకొచ్చారు. కొత్త ఎల్ఈడి డిఆర్ఎల్ లు.. కనెక్టెడ్ ఎల్ఈడి ల్యాంప్స్.. కొత్త ఫ్రంట్ గ్రిల్.. స్ఫూర్తి బంపర్ డిజైన్.. ఎస్ యూవీ తరహా ఎత్తయిన బాడీ.. 193 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో ఉన్నాయి.

కారు లోపల కూడా అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా కొత్త డ్యాష్బోర్డ్.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇందులో ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో.. ఆపిల్ కార్ ప్లే ఇందులో ఉంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్.. ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్.. 360 డిగ్రీల కెమెరా.. వైర్లెస్ చార్జింగ్ ఇందులో ఉన్నాయి.

1.25 లీటర్ పెట్రోల్.. 1.2 లీటర్ టర్బో పెట్రోల్.. 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్లు ఇందులో ఉన్నాయి. పెట్రోల్ మోడల్ లో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఏఎంటి గేర్ బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. టర్బో పెట్రోల్లో మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. సీఎన్జీ లో మాన్యువల్.. ఏఎంటి ఆప్షన్లు ఎంపిక చేసిన వేరియంట్లలో లభిస్తాయి…

టాటా పంచ్ కు మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణంలో సెక్యూరిటీ ఒకటి. కొత్త మోడల్ కార్లో 6 ఎయిర్ బ్యాగులు.. ఏబీఎస్.. ఈబిడి.. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం.. హిల్ హోల్డ్ కంట్రోల్..ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 1,96,572 యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీ గా నిలిచింది. ఫైనాన్షియర్ 2026లో టాటా నెక్సన్ 16,054 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానానికి చేరుకుంది. టాటా పంచ్ 1,83,980 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది తక్కువ బడ్జెట్లో ఎస్ యు వి లుక్.. మంచి గ్రౌండ్ క్లియరెన్స్.. భద్రత.. పెట్రోల్ లేదా సిఎన్జి ఆప్షన్ కోరుకునే వారికి టాటా పంచ్ అత్యుత్తమమైనది. వెనుక సీటు స్థలం.. హైవే పనితీరు.. సర్వీస్ అనుభవం అంటే అంశాలను కూడా టెస్టు డ్రైవ్ లో పరిశీలించాల్సి ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆరు లక్షల లోపు ప్రారంభ ధరతో ఎస్ యూవీ అనుభవం అందించడమే టాటా పంచ్ ప్రధాన ఆకర్షణ . అందుకే మారుతి.. హ్యుందాయ్.. వంటి దిగ్గజ బ్రాండ్లకు ఈ కారు గట్టి పోటీ ఇస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper