Rishabh Pant: 2024-25 బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ అనవసరమైన భారీ షాట్ ఆడాడు. వికెట్ కోల్పోయాడు. ఆ సమయంలో సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. లైవ్ కామెంట్రీ లోనే స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అంటూ పంత్ షాట్ ఎంపికను తీవ్రంగా తప్పుపట్టాడు. ఎవరైతే తనను తిట్టారో.. వారి నుంచే ప్రశంసలు అందుకున్నాడు.
న్యూజిలాండ్లో వెల్డింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తనదైన దూకుడు శైలితో న్యూజిలాండ్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు.. అతడు కుదురుకున్న తర్వాత భారీగా షాట్లు కొట్టి.. పరుగుల వరద పారించాడు. చివరికి సిక్సర్ కొట్టి తన టెస్ట్ కెరియర్ లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ శతకం పూర్తి చేయగానే కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ చప్పట్లు కొడుతూ అభినందించాడు. ఆయన ముఖంలో కనిపించిన ఆనందం.. కళ్ళ నుంచి వచ్చిన ఆనంద భాష్పాలు కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. పంత్ సాధించిన ఘనతను చూసి గవాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు.. విమర్శలు అత్యంత సహజం. ఒకప్పుడు ఆటగాడు తప్పును ఎత్తి చూపిన దిగ్గజాలు .. అదే ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటారు. ఇప్పుడు టీమిండియా వికెట్ కీపర్ పంత్ విషయంలో అదే జరిగింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో పంత్ సెంచరీ చేయడంతో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.
ఈ మ్యాచ్ లో పంత్ 153 బంతులలో 128 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. ఆరు సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా.. సౌత్ ఆఫ్రికా.. ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ వంటి దేశాలలో టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా పంత్ రికార్డు సృష్టించాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 720/9 పరుగులు చేసింది. ఒకప్పుడు పంత్ షార్ట్ సెలక్షన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన గవాస్కర్.. ఇప్పుడు అతడు సెంచరీకి చప్పట్లు కొట్టడం.. క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఈ మ్యాచ్ లో పంత్ ముందుగా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన వీరవిహారాన్ని కొనసాగించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు.
EMOTIONS BY SUNIL GAVASKAR WHEN PANT COMPLETED THE HUNDRED 🥹❤️ https://t.co/xYrL4nhLrb
— Johns. (@CricCrazyJohns) November 22, 2026