Green SM: ఒకప్పుడు క్యాబ్ బుక్ చేయాలంటే ఓలా.. ఉబర్ గుర్తుకు వచ్చేవి. ఆ తర్వాత రాపిడ్ వంటి సంస్థలు పోటీలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ క్యాబ్లతో మరో అంతర్జాతీయ సంస్థ భారత మార్కెట్లోకి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అదే గ్రీన్ ఎస్ఎం (green SM) కిలోమీటర్ కు కేవలం ఎనిమిది కే ప్రయాణం అంటూ ఈ కంపెనీ గురించి ప్రచారం విపరీతంగా జరుగుతుంది దీంతో క్యాబ్ ప్రయాణికుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. ఇదే సమయంలో ఓలా.. ఉబర్ డ్రైవర్లలో.. సొంతంగా క్యాబ్ లు నడుపుకునే వారిలో ఆందోళన మొదలైంది..
అసలు ఈ గ్రీన్ ఎస్ఎం కంపెనీ ఎవరిది.. దీని వెనుక ఉన్న వ్యాపార సామ్రాజ్యం ఎలాంటిది.. నిజంగానే కిలోమీటర్ కు 8కే ప్రయాణం చేయవచ్చా.. ఇంత తక్కువ ధరకు క్యాబ్ లు నడిపితే కంపెనీకి ఎలా లాభం వస్తుంది.. సంప్రదాయ క్యాబ్ డ్రైవర్లకు ఎలాంటి నష్టం కలుగుతుంది.. ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం
గ్రీన్ ఎస్ఎం కంపెనీ అనేది వియత్నాం దేశానికి చెందిన విన్ గ్రూప్ (Vin group) వ్యాపార వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. దీనిని గ్రీన్ అండ్ స్మార్ట్ ఎబిలిటీ పేరుతో 2023లో మొదలుపెట్టారు. వియత్నం బిలినియర్.. విన్ గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూయోంగ్(Pham Nhat Vuong) ఈ సంస్థ స్థాపన వెనుక ఉన్నారు. ఇదే గ్రూప్ కు చెందిన మరో సంస్థ విన్ ఫాస్ట్ (Vi Fast) .. ఈ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్తుంది. గ్రీన్ ఎస్ఎం తన క్యాబ్ సేవ కోసం విన్ ఫాస్ట్ తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తోంది. కార్ల తయారీ నుంచి వాటిని క్యాబ్ లు గా రోడ్లపై నడపడం వరకు ఒకే వ్యాపార వ్యవస్థలోని సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇది సాధారణ ఓలా.. ఉబర్ వ్యాపారనమునకు పూర్తిగా భిన్నమైనది.
గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లు కిలోమీటర్ కు 8 రూపాయలకే ప్రయాణం అందిస్తాయంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై కంపెనీ ఇచ్చింది. 8 రూపాయలకు ప్రయాణం వాస్తవం కాదని.. తాము వసూలు చేసే ధరలు ఆయా రాష్ట్రాల రవాణా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని కంపెనీ ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ వెబ్సైట్లో ప్రచురించిన లిమో క్యాబ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి 5 కిలోమీటర్లకు 205.. ఆరు నుంచి 8 కిలోమీటర్ల వరకు కిలోమీటర్ కు 23 రూపాయలు.. 9 కిలోమీటర్ల నుంచి కిలోమీటర్ కు 17 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ ధరల్లో జిఎస్టి.. ప్రయాణికుల భీమా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆఫర్లు.. అదనపు చార్జీలు.. టోల్ వంటి అంశాల ఆధారంగా బిల్లులు మారే అవకాశం ఉంది.
గ్రీన్ ఎస్ఎం వ్యాపార విధానంలో ప్రధానమైన అంశం ఎలక్ట్రిక్ వాహనాలు. సాధారణ పెట్రోల్.. డీజిల్ కార్లతో పోల్స్ చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంధన ఖర్చు అస్సలు ఉండదు. విద్యుత్ చార్జింగ్ ఖర్చు మాత్రమే ఉంటుంది. అందువల్ల నిర్వహణలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో ఈ కంపెనీ కేవలం డ్రైవర్లకు ఈ యాప్ ద్వారా ప్రయాణికులను పరిచయం చేసే సంస్థ మాత్రమే కాదు. సొంతంగా వాహనాలను సమకూర్చుకొని క్యాబ్ సేవలు నిర్వహిస్తోంది. విన్ ఫస్ట్ వాహనాల వినియోగం వల్ల వాహనాల సరఫరా.. నిర్వహణ.. క్యాబ్ సేవల మధ్య సమన్వయం సాధించే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులకు ఆకర్షణీయమైన ధరలు అందిస్తూ మార్కెట్లో కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎక్కువ రైడ్లు.. పెద్ద వాహనాల సముదాయం.. కార్పొరేట్ రవాణా వంటి విభాగల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నది. అయితే వాహనాల కొనుగోలు.. బ్యాటరీలు.. చార్జింగ్ కేంద్రాలు.. డ్రైవర్ల జీతాలు.. బీమా వంటి ఖర్చులు భారీగానే ఉంటాయి. మొదటి ఆరు కిలోమీటర్ల వరకు ధర ఒక తరహాలో ఉంటే.. ఆ తర్వాత ధర మరో స్థాయిలో ఉంటోంది. అందువల్లే కస్టమర్ల జేబులకు ఈ కంపెనీ బొక్క పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.