Homeబిజినెస్Vivo X fold 6: ఈ ఫోన్ ఉంటే ల్యాప్ టాప్ అవసరం లేదు..

Vivo X fold 6: ఈ ఫోన్ ఉంటే ల్యాప్ టాప్ అవసరం లేదు..

Vivo X fold 6: స్మార్ట్ ఫోన్ అంటే కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకునేందుకు.. వాట్సాప్ మెసేజ్ లు పంపుకునేందుకు.. ఫోటోలు తీసుకునేందుకు మాత్రమే పరిమితమైన రోజులు పోయాయి. ఇప్పుడు ఫోన్లో ఆఫీస్ పనులు చేసుకోవచ్చు డాక్యుమెంట్లు తయారు చేసుకోవచ్చు. ఒకేసారి నాలుగైదు యాప్స్ ఉపయోగించవచ్చు. కంప్యూటర్ తరహాలో పనిచేసుకునే అవకాశం కూడా వస్తోంది. ఇలాంటి సమయంలో ల్యాప్ టాప్ అవసరాన్ని ప్రశ్నార్థకం చేస్తూ మార్కెట్లోకి వచ్చింది Vivo x Fold 6. ముఖ్యంగా ఇందులో అందించిన […]

Vivo X fold 6: స్మార్ట్ ఫోన్ అంటే కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకునేందుకు.. వాట్సాప్ మెసేజ్ లు పంపుకునేందుకు.. ఫోటోలు తీసుకునేందుకు మాత్రమే పరిమితమైన రోజులు పోయాయి. ఇప్పుడు ఫోన్లో ఆఫీస్ పనులు చేసుకోవచ్చు డాక్యుమెంట్లు తయారు చేసుకోవచ్చు. ఒకేసారి నాలుగైదు యాప్స్ ఉపయోగించవచ్చు. కంప్యూటర్ తరహాలో పనిచేసుకునే అవకాశం కూడా వస్తోంది. ఇలాంటి సమయంలో ల్యాప్ టాప్ అవసరాన్ని ప్రశ్నార్థకం చేస్తూ మార్కెట్లోకి వచ్చింది Vivo x Fold 6. ముఖ్యంగా ఇందులో అందించిన origin OS 7 ఆపరేటింగ్ సిస్టం.. పెద్ద పోల్డబుల్ డిస్ ప్లే.. మల్టీ టాస్కింగ్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోన్లో 8.02 అంగుళాల మెయిన్ డిస్ ప్లే ఉంది. ఇందులో origin work bench టీచర్ సహాయంతో ఒక ప్రధాన పనితో పాటు మరో నాలుగు సపోర్టింగ్ టాస్క్ లు ఒకేసారి చేయవచ్చు. ఉదాహరణకు ఒకవైపు మెయిల్ ఓపెన్ చేసి.. మరోవైపు డాక్యుమెంట్ చదువుతూ.. ఇంకోవైపు బ్రౌజర్ లో సమాచారం వెతుక్కోవచ్చు. అంటే చిన్న స్క్రీన్ పై ఇబ్బంది పడకుండా ఓకే డిస్ ప్లే పై అనేక పనులు చేసుకోవచ్చు.

సాధారణంగా ఒక ఫోన్లో ఒకేసారి రెండు యాప్స్ ఉపయోగించడమే చాలామందికి అలవాటు. కానీ ఇందులో మల్టీ స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ద్వారా నాలుగు యాప్స్ ను పక్కపక్కన పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాటిని విండోల పరిమాణాలను మార్చుకోవచ్చు. ఇందులో ఏ ఐ క్రాస్.. ఆప్ డ్రాగ్ అనే ప్రధానమైన ఫీచర్ ఉంది. ఒక యాప్ లో ఉన్న సమాచారాన్ని మరో యాప్ లోకి సులభంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక ఫోటోలో ఉన్న టెక్స్ట్ ను గుర్తించి.. దానిని మరో యాప్ లోకి తీసుకువెళ్లి అనువదించుకోవచ్చు. విద్యార్థులకు.. పాత్రికేయులకు.. వ్యాపారవేత్తలకు.. కంటెంట్ థియేటర్లకు ఈ ఫీచర్లు ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

ఆఫీసు మీటింగ్లకు వెళ్లే వారికి ఇందులో మరో మంచి సౌకర్యం ఉంది. ఇందులో ఏ ఐ రికార్డర్ ఫీచర్ ద్వారా సంభాషణలను రికార్డు చేయడం మాత్రమే కాదు స్పీకర్ల వారీగా ట్రాన్స్క్రిప్షన్.. ముఖ్యమైన అంశాల సారాంశం పొందవచ్చు. ఏఐ క్యాప్షన్స్ ద్వారా ఆన్లైన్ మీటింగ్లలో రియల్ టైం సబ్ టైటిల్స్ కూడా పొందవచ్చు. ఇక ఏఐ ఫైల్ మేనేజర్ సహాయంతో ఫైల్స్ నిర్వహించుకోవచ్చు. పెద్ద పిడిఎఫ్ డాక్యుమెంట్లను చదవడానికి ఏఐ రీడర్ మూడు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కువ డాక్యుమెంట్లు చదివేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఫోన్లో మరో ఫీచర్ డెస్క్ టాప్ మోడ్. ఫోన్ ను అనుకూలమైన మానిటర్ లేదా టీవీకి కనెక్ట్ చేస్తే డెస్క్ టాప్ తరహా ఇంటర్ఫేస్ లో పనిచేసుకోవచ్చు. కీబోర్డ్.. మౌస్ సపోర్ట్ కూడా ఉంటుంది.

వివో ఆఫీస్ కిట్ ద్వారా కంప్యూటర్తో ఫైల్స్ షేర్ చేసుకోవడం.. ఇతర పరికరాలతో కనెక్ట్ కావడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే డెస్క్ టాప్ మోడ్.. జోవిక్ పీసీ వంటి కొన్ని ఫీచర్లకు అవసరమైన ఓటిఏ అప్డేట్స్.. అనుకూలమైన పరికరాలు.. సాఫ్ట్వేర్ వెర్షన్లు అవసరమవుతాయి. అవసరమైతే ఫోన్ ను చిన్న కంప్యూటర్ లాగా మార్చుకోవచ్చు.

వివో ఎక్స్ ఫోల్డ్ సిక్స్ లో ZIESS కెమెరా వ్యవస్థ ఉంది. 200 మెగాఫిక్సల్ ZIESS మెయిన్ కెమెరా.. 50 మెగా పిక్సెల్ ziess పెరిస్కోప్ టెలి ఫోటో కెమెరా.. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరా.. 100 ఎక్స్ ZIESS హైపర్ జూమ్.. ఓఐఎస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇందులో ఉంటాయి. ఫోటోగ్రఫీ తో పాటు వీడియో రికార్డింగ్ కు ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా టెలిఫోటో కెమెరాతో దూరంలో ఉన్న వస్తువులను దగ్గరగా చిత్రీకరించవచ్చు..

పెద్ద డిస్ ప్లే.. ఒకేసారి అనేక రకాల యాప్స్.. ఇలా అనేక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో బ్యాటరీ అత్యంత కీలకం. 6,900 ఎంహెచ్ బ్యాటరీ అందించారు. దీనికి 800 వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్.. 40 డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే మీడియా టెక్ డైమన్ సిటీ 9500 సూపర్ ఎడిషన్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. భారీ మల్టీ టాస్కింగ్.. గేమింగ్.. ఏఐ ఫీచర్లను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించారు. దీని ధర 2,19,999 వరకు ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper