Sudigaali Sudheer: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు సుడిగాలి సుధీర్. ఈయనకు సంబంధించిన కామెడీ స్కిట్స్ వీడియోస్ క్లిప్స్ ని మీమర్స్ తెగ ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయం లో సుడిగాలి సుధీర్ పై లో రూమర్స్ కూడా మామూలు రేంజ్ లో ఉండవు. ఎదో ఒక రూపం లో ఆయన పేరు సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ని ఉపయోగించే పేజీలు కూడా సుడిగాలి సుధీర్ ని ఉపయోగించుకొని అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే సుడిగాలి సుధీర్ పెళ్లి విషయం పై సోషల్ మీడియా లో ఇప్పటికే ఎన్నో వందల కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. 35 ఏళ్ళ వయస్సు దాటినప్పటికీ ఆయనకు పెళ్లి అవ్వకపోవడం తో , ఈ టాపిక్ మీద ఎన్నో స్పెషల్ ఈవెంట్స్ ని కూడా నిర్వహించారు , వాటికి అద్బుత్యమైన రేటింగ్స్ వస్తుండేవి.
ఇదంతా పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు సుధీర్ , రష్మీ లను ఒక జోడీగా పెట్టి , త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ పుట్టించేవారు. ఎందుకంటే జబర్దస్త్ తో పాటు , ఢీ డ్యాన్స్ షో లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సీజన్స్ చేశారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండడంతో , ఈ జోడీ బుల్లితెర పై పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ తో సుధీర్ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. ఈమధ్య కాలం లో అనేక షోస్ లో జంటగా కనిపించిన వీళ్లిద్దరు , రీసెంట్ ప్రాజెక్ట్ k -చెఫ్ మంత్రం ప్రోగ్రాం లో కూడా జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన క్యూట్ రొమాన్స్ ఆడియన్స్ ని బాగా అలరించింది.
అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం చేసిందని ఇద్దరూ అనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినా ఇదంతా ఫన్ కోసమే అని జనాలకు కూడా స్పష్టంగా అర్థం అయ్యింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జోడీకి మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సుధీర్ ప్రస్తుతం జీ తెలుగు లో సరిగమప షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 కి కూడా ఆయన హోస్ట్ గా కొనసాగుతున్నాడు. వీటితో పాటు హైలెస్సో , జోకర్ వంటి చిత్రాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇలా కెరీర్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతూ మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్.