Indian Railways: అదొక దుకాణం.. ముగ్గురు వ్యక్తులు అక్కడ వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చారు. వారంతా కూడా తెల్లటి దుప్పట్లు కప్పుకున్నారు. చూస్తుంటే వారేదో మాల వేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వారు మాల వేసుకోలేదు. వారు కప్పుకుంది తెల్లటి దుప్పట్లు. అవి వారు కొనుగోలు చేసినవి కాదు. దొంగిలించినవి.
ఆ వ్యక్తులు ఇటీవల రైల్లో ప్రయాణించారు. ప్రయాణించిన తర్వాత రైల్వే శాఖ ఇచ్చిన బెడ్ షీట్లను తమ వెంట తీసుకెళ్లారు. స్లీపర్.. ఏసి బోగిలలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. బెడ్ షీట్లు నాణ్యంగా ఉంటాయి. తెల్లగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే కొందరు పర్యాటకులు వీటిని దొంగిలిస్తుంటారు. తమతో పాటు వాటిని తీసుకెళ్తుంటారు. అయితే ఇటువంటి ఘటనలు వెలుగులోకి అంతగా రావు. తాజాగా ఒక వీడియో ద్వారా ప్రయాణికులు రైల్వే శాఖ అందించిన తెల్లటి దుప్పట్లను ఏ విధంగా దొంగిలించారు.. వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం బయటకు వచ్చింది.
ఓ దుకాణం వద్ద రైల్వే బెడ్ షీట్లను షావల్స్ లాగా ధరించి ముగ్గురు వ్యక్తులు సీసీ కెమెరాలకు చిక్కారు. ఆ బెడ్ షీట్ల మీద వెస్ట్రన్ రైల్వే అని ముద్రించి ఉంది. దీని ప్రకారం వాటిని వాళ్లు దొంగిలించారని అర్థమవుతూనే ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులను గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక 2022 జనవరి నుంచి 2026 మే వరకు దాదాపు 1.27 కోట్లకు పైగా బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆర్టిఐ డేటా ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇందులో బెడ్ షీట్లు 41.13 లక్షలు.. పేస్ టవల్స్ 46.54 లక్షలు.. పిల్లో కవర్లు 23.59 లక్షలు.. దిండ్లు 2.76 లక్షలు.. దుప్పట్లు 12.95 లక్షలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ కోట్లల్లో ఉంటుంది.
దూర ప్రాంతాలకు వెళ్లేవారు విలాసవంతమైన బోగిలలో ప్రయాణం చేస్తుంటారు. వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి పడుకునే సమయంలో దుప్పట్లు.. టవల్స్.. దిండ్లు అందజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు వాటిని చోరీ చేస్తున్నారు. చోరిచేసినవారు వాటిని తమ బ్యాగులలో తీసుకెళ్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడం సాధ్యం కాదు. అందువల్లే ఇటువంటి దొంగతనాలు సాగిపోతున్నాయి. అయితే రైల్వే శాఖ దుప్పట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో.. దొంగతన చేసిన వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తాజా వీడియో ద్వారా బయటికి వచ్చింది.
ఆఖరికి.. రైల్వే బెడ్షీట్లను కూడా వదిలిపెట్టలేదే!
ఓ దుకాణం వద్ద రైల్వే బెడ్షీట్లను షాల్స్లా ధరించి.. కెమెరాకు చిక్కిన ముగ్గురు వ్యక్తులు
ఆ బెడ్షీట్లపై వెస్ట్రన్ రైల్వే అని ముద్రించి ఉండటంతో వాటిని దొంగలించారని విమర్శలు
ఆ ముగ్గురు వ్యక్తుల్ని గుర్తించి.. తగిన చర్యలు… pic.twitter.com/mNPKk5uDNm
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 23, 2026