Homeఅంతర్జాతీయంCountries Without Night : రాత్రి ఉండని ఈ ఆరు దేశాల గురించి తెలుసా?

Countries Without Night : రాత్రి ఉండని ఈ ఆరు దేశాల గురించి తెలుసా?

Countries Without Night : ప్రపంచంలోనే భారతదేశంతో పాటు కొన్ని దేశాల్లో 12 గంటల పాటు రాత్రి.. 12 గంటలపాటు పగలు ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో నిత్యం పగలు.. మరి కొన్ని ప్రాంతాల్లో నిత్యం రాత్రి ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. భూమి 30 డిగ్రీల కోణంలో వంగి భ్రమణం చెందడంతో ఈ దేశాలపై నిత్యం సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అలాగే మరికొంత కాలం వ్యతిరేక దిశలో భ్రమణం చేయడంతో సూర్యకిరణాలు పడకుండా రాత్రి ఉంటుంది. […]

Countries Without Night : ప్రపంచంలోనే భారతదేశంతో పాటు కొన్ని దేశాల్లో 12 గంటల పాటు రాత్రి.. 12 గంటలపాటు పగలు ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో నిత్యం పగలు.. మరి కొన్ని ప్రాంతాల్లో నిత్యం రాత్రి ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. భూమి 30 డిగ్రీల కోణంలో వంగి భ్రమణం చెందడంతో ఈ దేశాలపై నిత్యం సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అలాగే మరికొంత కాలం వ్యతిరేక దిశలో భ్రమణం చేయడంతో సూర్యకిరణాలు పడకుండా రాత్రి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఈ ఆరు దేశాల గురించి తెలుసుకుందాం..

అలస్కా:
అమెరికాలోని అలాస్కా దేశం అంటార్కిటికా ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ దేశంలో దాదాపు 51 రోజులపాటు సూర్యుడు నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు. వేసవికాలంలో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఒకప్పుడు రష్యా ఆధీనంలో ఉన్న ఈ దేశాన్ని అమెరికా కొనుగోలు చేసింది.

కెనడా:
ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో కెనడా కూడా ఉంటుంది. ఈ దేశం ఆర్కిటిక్ సర్కిల్లో ఉంటుంది. ఇక్కడ వేసవికాలంలో 51 రోజులపాటు సూర్యుడు కనిపిస్తాడు. అందుకే ఇక్కడ మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు. కెనడా దేశంలోని నునావుట్, నార్త్ వెస్ట్ టెరిటరీస్ వంటి ప్రాంతాల్లో సూర్యుడు ఒకే మాదిరిగా కనిపిస్తాడు.

పిన్ ల్యాండ్:
ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ గా పేర్కొనే ఈ దేశంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువసేపు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా లాఫ్ లాండ్ ప్రాంతంలో సూర్యుడు 50 రోజులపాటు నిరంతరంగా కొనసాగుతాడు. అర్ధరాత్రి సమయంలో కూడా ఇక్కడ సూర్యుడు కనిపించడం విశేషం.

ఐస్లాండ్:
ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్న ఈ దేశం లో వేసవికాలం పూర్తిగా చీకటిగా మారదు. ముఖ్యంగా జూన్ నెలలో అర్ధరాత్రి సమయంలో కూడా ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ సూర్యుడు 24 గంటల పాటు ఒకే దిశలో ఉన్నట్లు తెలుస్తుంది.

నార్వే:
ప్రపంచంలోని అందమైన దేశంగా పేర్కొనే నార్వేలో కూడా సూర్యుడు కొన్ని వారాలపాటు అస్తమించకుండా ఉంటాడు. ముఖ్యంగా స్మాల్ బార్డ్ వంటి ప్రాంతంలో ఈ దృశ్యాన్ని చూడొచ్చు. మే 31 నుంచి జూలై 31 వరకు దాదాపు 90 రోజులపాటు ఇక్కడ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు.

స్వీడన్:
ఈ దేశంలో సూర్యుడు 100 రోజులపాటు నిరంతరంగా కనిపిస్తాడు. ఇది కూడా ఆర్కిటిక్ సర్కిల్ లో కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper