IAF report: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది.. పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు నిజంగా నేలమట్టమయ్యాయా.. ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. ఇప్పటివరకు ఈ ప్రశ్నలే కొన్ని రకాల మీడియా సంస్థలు.. కొన్ని రకాల వ్యక్తులు లేవనెత్తారు. వారందరి నోర్లు మూతపడే విధంగా ఒక కీలక నివేదిక బయటకు వచ్చింది. అందులో సంచలన నిజాలు వెలుగు చూశాయి.
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మీద భారత్ శివతాండవం చేసింది. ఈ ఆధారాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారత వైమానిక దళం (Indian Air force) సంచలన విషయాలను బయటపెట్టింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 6 నుంచి 7 తేదీలలో ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆక్రమించిన జమ్ము కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మనదేశంలోని సైనిక.. పౌర ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు చేసింది.
భారత వైమానిక దళం అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్.. మనదేశంలోని పౌరులు నివసించే ప్రాంతాలు.. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు.. వైమానిక దాడులకు ప్రయత్నించింది. దీనిని భారత వైమానిక దళం సమర్థవంతంగా తీసుకొట్టింది.. పాకిస్తాన్ దేశంలోని నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్, జాకో బాబాద్ వైమానిక స్థావరాలతో పాటు.. అనేకమైన కీలక స్థావరాల మీద దాడులు చేసింది. ఈ దాడులలో హ్యాంగర్లు.. రన్వేలు పనికిరాకుండా పోయాయి. ఈ దాడులలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు.. ఒక ఎ ఇ డబ్ల్యు& విమానం.. 30 దేశానికి చెందిన అకిన్సీ, టీబీ 2 తరగతికి చెందిన పలు మానవ రహిత కాంబాట్ ఏరియల్ వెహికల్స్ (UCAVs) దెబ్బతిన్నాయని వివరించింది. పాకిస్తాన్ సైన్యం చెందిన పలువురు చనిపోయినట్టు పేర్కొంది.
భారత్ చేసిన దాడులలో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ దేశానికి చెందిన రాడార్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్లు దెబ్బతిన్నాయి. చక్లాలా.. రహీం యార్కన్.. సుక్కుర్.. మరీద్.. సర్ గోదా.. జూకో బాబాద్.. బోలారి ప్రాంతాలలో కీలకమైన వైమానిక రక్షణ కేంద్రాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ లక్ష్యంగా చేసుకుంది. చక్లా ప్రాంతంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉందని ఈ సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ గుర్తించింది. మొత్తంగా ఆరు రాడార్లు.. రెండు ఉపరితలం నుంచి ఇంకా గన తలానికి ప్రయోగించే గైడ్ వెపన్స్ వంటి ప్రాంతాలపై భారత్ దాడులు చేసింది. అంతేకాదు ఎస్ 400 ఎయిర్ డిఫరెన్స్ సిస్టం ద్వారా సుమారు 314 km దూరంలో ఉన్న పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన మిషన్ విమానాన్ని భారత్ పడగొట్టింది అదే కాదు ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంత దూరం నుంచి జరిగిన సర్ఫేస్ టు ఎయిర్ కిల్ అని భారత ప్రకటించింది.. నేల కూలిపోయిన పాకిస్తాన్ విమానం ఏ కేటగిరికి చెందిన మాత్రం భారత వైమానిక దళం వివరించలేదు.