uttarandhra politics: స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ లు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడైన మజ్జి శ్రీను వైసీపీ నుంచి వెళ్లిపోయారు. టిడిపి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే.. జెడ్పి మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు కూడా చేరిపోయారు. అయితే ఆయన టిడిపి కండువా కప్పుకోక పోయినప్పటికీ.. పార్టీ నాయకత్వ తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ అధినేత జగన్ అప్పలనాయుడు సస్పెండ్ చేశారు. దీంతో క్షణాల విధిలోనే అప్పలనాయుడు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆత్మగౌరవం నేను చోట తాను ఉండలేనని.. తన అనుచరులు కూడా ఉండలేరని స్పష్టం చేశారు. వైసిపి ఒక రాజకీయ పార్టీ మాదిరిగా లేదని.. అది వైయస్ జగన్ చేతిలో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఉందని అప్పలనాయుడు ఆరోపించారు.
జగన్ వ్యవహార శైలి మాత్రమే కాకుండా బొత్స సత్యనారాయణ తీరని కూడా ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. పార్టీలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను బండకేసి కొట్టారు. మజ్జి శ్రీను తనకు బావ కావడంతోనే జగన్ కక్ష కట్టారని అప్పలనాయుడు ఆరోపించారు. అందువల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఆ ప్రకారం మజ్జి శ్రీను కూడా బొత్స సత్యనారాయణకు మేనల్లుడు అవుతారని.. అలాంటప్పుడు ఆయనను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ అప్పలనాయుడు ప్రశ్నించారు.
మొన్నటికి మొన్న మజ్జి శ్రీను.. ఇప్పుడు అప్పలనాయుడు.. రేపటి రోజున ఇంకెవరు పార్టీ నుంచి వెళ్ళిపోతారు తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. విలేకరుల ముందుకు వచ్చి అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెబుతుంటారు. కానీ వాస్తవంలో మాత్రం వేరే విధంగా ఉంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది.
ధర్మాన ప్రసాదరావు.. ధర్మాన కృష్ణ దాస్ వ్యవహార శైలిని ఇటీవల కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ బయట పెట్టారు. ఆ తర్వాత జగన్ తమ్మినేని సీతారాం ను తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. ఆయనకు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఇస్తున్నటు ప్రకటించారు. మజ్జి శ్రీను టిడిపిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ కుమార్తెను నియమించారు. వాస్తవానికి టిడిపి కొడుతున్న దెబ్బకు ఉత్తరాంధ్రలో వైసీపీకి దిమ్మ తిరిగిపోతోంది. ఎన్ని రకాలుగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఫలితం వచ్చే అవకాశం ఉంది.