Homeబిజినెస్Fitbit Air: భారత్ లోకి వచ్చేసిన స్క్రీన్ లెస్ ఫిట్నెస్ ట్రాకర్.. ధర, ఫీచర్లు ఇవే

Fitbit Air: భారత్ లోకి వచ్చేసిన స్క్రీన్ లెస్ ఫిట్నెస్ ట్రాకర్.. ధర, ఫీచర్లు ఇవే

Fitbit Air: స్మార్ట్ వాచ్ లు అంటే స్క్రీన్.. నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజ్ లు.. ఇలా ఎన్నో ఫీచర్లు గుర్తుకొస్తుంటాయి. అయితే ఇప్పుడు స్క్రీన్ లేకుండానే ఆరోగ్యం.. ఫిట్నెస్ ను ట్రాక్ చేసే కొత్త ట్రెండు ఊపొందుకుంటున్నది. ఈ క్రమంలోనే గూగుల్ తన కొత్త Fitbit Air ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్క్రీన్ లేదు ఫిట్ బిట్ ప్రత్యేకత దాని స్క్రీన్ లెస్ డిజైన్. అంటే చేతికి కట్టుకున్నప్పుడు ఇందులో ఎటువంటి డిస్ప్లే కనిపించదు. నోటిఫికేషన్లు.. […]

Fitbit Air: స్మార్ట్ వాచ్ లు అంటే స్క్రీన్.. నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజ్ లు.. ఇలా ఎన్నో ఫీచర్లు గుర్తుకొస్తుంటాయి. అయితే ఇప్పుడు స్క్రీన్ లేకుండానే ఆరోగ్యం.. ఫిట్నెస్ ను ట్రాక్ చేసే కొత్త ట్రెండు ఊపొందుకుంటున్నది. ఈ క్రమంలోనే గూగుల్ తన కొత్త Fitbit Air ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

స్క్రీన్ లేదు

ఫిట్ బిట్ ప్రత్యేకత దాని స్క్రీన్ లెస్ డిజైన్. అంటే చేతికి కట్టుకున్నప్పుడు ఇందులో ఎటువంటి డిస్ప్లే కనిపించదు. నోటిఫికేషన్లు.. మెసేజ్లు.. ఇతర డిస్ట్రక్షన్స్ లేకుండానే ఆరోగ్యం.. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టే విధంగా దీన్ని రూపొందించారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే గూగుల్ హెల్త్ యాప్ లో చూడాలి. ఫిట్ బిట్ ఎయిర్ 24/7 ధరించేందుకు వీలుగా చిన్న, తేలికైన పెబెల్ ఆకారంలో రూపొందించారు.

హెల్త్ ట్రాకింగ్ ఎలా చేపడుతుంది

  • 24/7 హార్ట్ రేటింగ్ మానిటరింగ్
  • హార్ట్ రిథమ్ మానిటరింగ్
  • ఏఎఫ్ ఐబీ అలర్ట్స్
  • బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్
  • రెస్టింగ్ హార్ట్ రేట్
  • హార్ట్ రేట్ వేరేబిలిటీ
  • స్లీప్ స్టేజెస్, స్లీప్ డ్యూరేషన్ ట్రాకింగ్
  • ఆటోమెటిక్ యాక్టివిటీ డిటెక్షన్
    వర్క్ అవుట్ ట్రాకింగ్.. అంటే పగలు వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా రాత్రి నిద్రపోయే సమయంలో కూడా ధరించవచ్చు.

స్మార్ట్ వాచ్లలో తరచూ చార్జింగ్ పెట్టాల్సిన రావడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తుంది. కేవలం ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే ఒక రోజు వరకు ఉపయోగించుకునే శక్తి లభిస్తుంది

ఇక ఇందులో మరో కీలకమైన అంశం గూగుల్ హెల్త్ కోచ్.. యూజర్ ఆరోగ్యం.. నిద్ర.. యాక్టివిటీ.. ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి.. వ్యక్తిగత విషయాలను.. సూచనలను అందిస్తుంది.

వర్కౌట్ యాప్ ద్వారా దీనిని ప్రారంభించవచ్చు. కొన్ని కార్యకలాపాలను ఫిట్ బిట్ ఎయిర్ ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది. ట్రాక్ కూడా చేస్తుంది. అంతేకాకుండా జిమ్ లోని పరికరం లేదా వైట్ బోర్డుపై ఉన్న వర్కౌట్ రొటీన్ ఫోటో తీసి కూడా వర్క్ అవుట్ ను లాగ్ చేసే అవకాశం గూగుల్ హెల్త్ కోచ్ లో ఉంది.

ఫిట్ బిట్ ఎయిర్లో 40కి పైగా ఎక్సర్సైజ్ మోడ్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఆటోమెటిక్ యాక్టివిటీ రికగ్నెన్సీ ద్వారా సాధారణ వ్యాయామాలను గుర్తించి ట్రాక్ చేస్తుంది.

ఇక మన దేశంలో దీని ధర 13,999 రూపాయలుగా నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి ఇది మార్కెట్లోకి వచ్చింది. గూగుల్ స్టోర్ తో పాటు ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, సేల్స్ వంటి రిటైల్ స్టోర్లలో కూడా దీని కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ వాచ్ లో వచ్చే కాల్స్.. మెసేజ్లు.. నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు అవసరం లేకుండా కేవలం ఆరోగ్యం, నిద్ర, ఫిట్నెస్ ను నిరంతరం ట్రాక్ చేయాలి అనుకునే వారికి ఇది ఒక ఆసక్తికరమైన పరికరం లాగా మారొచ్చు. అయితే 13,999 ధరలు స్క్రీన్ లేకుండా డివైస్ కొనడం విలువైనదేనా.. అనేది మాత్రం వినియోదారులు ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇదే ధర పరిధిలో డిస్ప్లే తో కూడిన ఫిట్నెస్ వేరేబల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిట్ బిట్ ఎయిర్ అసలు బలం మాత్రం డిస్ట్రక్షన్ లేని అనుభవం, 24/7 హెల్త్ ట్రాకింగ్, ఏడు రోజులపాటు బ్యాటరీ, గూగుల్ హెల్త్ కోచ్.

మొత్తంగా చూస్తే స్మార్ట్ వాచ్ లలో స్క్రీన్, నోటిఫికేషన్లతో విసిగిపోయిన వారికి గూగుల్ తీసుకొచ్చిన ఫిట్ బిట్ ఎయిర్ ఒక భిన్నమైన కాన్సెప్ట్. మన మార్కెట్ లో ఈ స్క్రీన్ వేరబుల్ ఎంత మేరకు విజయవంతమవుతుందో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper