Adarsa Kutumbam Movie: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పై అటు అభిమానుల్లో , ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ రైట్స్, సాటిలైట్ రైట్స్ , ఆడియో రైట్స్ , ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయాయి. అంతటి భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా , ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , మేకర్స్ ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. అందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ రెడీ అయ్యి రెండు రోజులైందట. నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని కూడా ఏర్పాటు చేశారట.
ఈ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ త్రివిక్రమ్ మార్క్ కామెడీ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిపోతుంది అట. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ గా నిలిచిందని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది అట. ఫస్ట్ హాఫ్ కే ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుందట. ఇక సెకండ్ హాఫ్ లో కామెడీ తో పాటు , యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయని. వెంకటేష్ ని యాక్షన్ సన్నివేశాల్లో ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదని అంటున్నారు . ఓవరాల్ గా ‘ఇరుముడి’ తర్వాత టాలీవుడ్ లో మరో సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతుంది అనే రేంజ్ టాక్ ఈ చిత్రానికి ఉంది.
మరి ఆడియన్స్ నుండి అదే రేంజ్ టాక్ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఆడియన్స్ నుండి ఆ రేంజ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. ఓవర్సీస్ నుండి అప్పుడే లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. చూస్తుంటే ప్రీమియర్స్ షోస్ తోనే వెంకటేష్ హైయెస్ట్ గ్రాసర్ అయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.