Rafale Fighter Jet : తక్కువ ధరలో వస్తువులను తయారు చేయగలదు. అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేయగలదు. తన కంపెనీల ద్వారా అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించగలదు. ఎందుకంటే చైనా దగ్గర అంత సీన్ ఉంది. పైగా చైనాలో విపరీతమైన మానవ వనరులు ఉన్నాయి. అక్కడి ప్రజలు కష్టపడి పని చేస్తూ ఉంటారు.. కాబట్టి తయారీ రంగం విషయంలో చైనాకు తిరుగులేదు.
వస్తువులను విపరీతంగా తయారు చేస్తూ ఉంటుంది.. అద్భుతంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది.. బ్రహ్మాండంగా వెనకేసుకుంటూ ఉంటుంది.. కానీ చైనా ఇంతకుమించి ఎదగలేదు. ఎందుకంటే డిఫెన్స్ రంగంలో చైనా తయారు చేసే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా డిమాండ్ ఉండదు. ఏదో పాకిస్తాన్ లాంటి దేశం తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తుంది గాని.. మిగతా దేశాలు చైనా డిఫెన్స్ పరికరాలను అంత ఈజీగా నమ్మవు. ఎందుకంటే అనేక యుద్ధాలలో చైనా పరికరాలు ఏ విధంగా పనిచేశాయి అనేది ప్రపంచ దేశాలకు తెలుసు.
చైనా డిఫెన్స్ రంగం ఇటీవల కాలంలో కాస్త తడబాటుకు గురవుతోంది. ఆ మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ దేశానికి చైనా డిఫెన్స్ పరికరాలు అందించింది. వాటిని ఇండియా మీద పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే అవి టార్గెట్ ను ఫినిష్ చేయలేకపోయాయి. పైగా మధ్యలోనే కుప్పకూలిపోయాయి. ఈ ఆధారాలను భారత్ స్వయంగా అంతర్జాతీయ వేదికల ముందు ఉంచింది. దీంతో చైనా ఆత్మ రక్షణలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఉపయోగించిన రఫెల్ యుద్ధ విమానాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది.
తాజాగా చైనా జె 16 పేరుతో ఫైటర్ జెట్లను తెరమీదకి తీసుకొచ్చింది. వీడిని రఫెల్ యుద్ధ విమానాలకు పోటీగా రంగంలోకి తీసుకువచ్చింది. ఇటీవల ఈజిప్ట్ తో సంయుక్తంగా చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. దీనికి ఈ గల్స్ ఆఫ్ సివిలైజేషన్ అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమంలో రఫెల్.. జె 16 పోరాట విన్యాసాలలో పాల్గొన్నాయి. అయితే రఫెల్ స్థాయిలో జె 16 దూసుకు వెళ్లలేకపోయింది… ఇదే చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్.. చైనా సంయుక్తంగా జెఎఫ్17 అనే ఫైటర్ జెట్ ను తయారుచేశాయి. అయితే జె 16 మన రఫెల్ యుద్ధ విమానాలను పోలి ఉన్న నేపథ్యంలో.. చైనా నుంచి వాటిని కొనుగోలు చేయాలని పాకిస్తాన్ భావిస్తుంది. ఇదే అదునుగా చైనా పాకిస్తాన్ నుంచి దండిగా సంపాదించాలని అనుకుంటున్నది.