Bigg Boss 10 Telugu: గత మూడు నాలుగు బిగ్ బాస్ సీజన్స్ నుండి నాగార్జున హోస్టింగ్ కొంతమంది కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తూ , మరికొంత మంది కంటెస్టెంట్స్ ని వెనకేసుకొని వస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ఈ సీజన్ అయితే మరీ దారుణం. త్రిగున్, ముకేశ్ గ్రాఫ్ లను పెంచడం కోసం, రోహిత్ గ్రాఫ్ ని తగ్గించడం కోసం బిగ్ బాస్ టీం చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ప్రతీ వారం చెయ్యని తప్పుని చేసినట్టుగా చూపించడం అలవాటు అయిపోయింది.ఇదంతా మేము అంటున్న మాటలు కాదు , సోషల్ మీడియా లో జనాలు మాట్లాడుకుంటున్న మాటలు. ఇంత ఓపెన్ గా ఒక మనిషిని టార్గెట్ చేయడం ఎంత వరకు న్యాయం?.. అగ్ని పరీక్ష కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు నిర్వహించేదే కదా?, అది కూడా సామాన్యులు పాల్గొనే షో.
దాన్ని త్రిగున్, సుధీర్ రెడ్డి వంటి కంటెస్టెంట్స్ రెండు మూడు సార్లు ఓపెన్ గా వెక్కిరించారు. నిన్న రోహిత్ బిగ్ బాస్ ని తిట్టాడో లేదో సరైన క్లారిటీ లేదు , అయినప్పటికీ కూడా అతను తిట్టాడు అని చెప్పి , కోట్ల మంది చూస్తున్న ఒక టెలివిజన్ షో లో బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి గెటౌట్ అన్నప్పుడు , అగ్ని పరీక్ష ని వెక్కిరించిన త్రిగున్ కి కూడా అలాంటి రియాక్షన్ ఇవ్వాలి కదా?, ఎందుకు ఇవ్వలేదు?, త్రిగున్ కూడా మాలాంటి సెలబ్రిటీ అనే భావం నాగార్జున కూడా ఉండడం వల్లే అలా జరిగిందా?, అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం బిగ్ బాస్ టీం కి ఎంతైనా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ ని కూడా ఇలాగే టార్గెట్ చేసాడు. ఆ తర్వాత ఆయన మోకాళ్ళ మీద క్షమాపణలు చెప్తే కానీ వదల్లేదు. కానీ చివరికి ఏమైంది?, టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు రోహిత్ కి కూడా అంతే. ఇప్పటికే 60 శాతం ఓటింగ్ తో ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ తో రోహిత్ ఓటింగ్ 80 శాతం కి వెళ్ళిపోయి ఉండొచ్చు. రోహిత్ తప్పులు దారుణంగా చేస్తున్నాడు అని చెప్పడానికి లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపించి అంత సీన్ చేస్తున్నారే , ఇవన్నీ జనాలు గమనించడం లేదని అనుకుంటున్నారా? , బిగ్ బాస్ టీం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొంటూ , ఎవ్వరైనా బిగ్ బాస్ నన్ను ఏమి పీకలేరు అని అనగలరా?, అంతటి కామన్ సెన్స్ లేకుండా రోహిత్ ప్రవరిస్తాడా?, స్పష్టంగా ‘ఈ వారం మొత్తం నిన్ను గెలుకుతూనే ఉంటాను రా , రెడ్ కార్డు వచ్చేలా చేస్తా చూడు’ అని చరణ్ అన్నప్పుడు, రోహిత్ వెంట్రుక కూడా పీకలేవు అనే గెస్చర్ ఇస్తాడు?, ఇది చరణ్ ని అన్నట్టే కదా?, బిగ్ బాస్ ని అన్నట్టు ఎలా అవుతుందో ఆ షో నిర్వాహకులకే తెలియాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.