Bigg Boss 10 Telugu: నిన్నటి ఎపిసోడ్ లో అన్యాయంగా రోహిత్ ని అక్కినేని నాగార్జున టార్గెట్ చేయడం పై సోషల్ మీడియా భగ్గుమంది. ప్రతీ ఒక్కరు నాగార్జున ని బిగ్ బాస్ టీం ని ఏకిపారేస్తున్నారు. సెలబ్రిటీలను ట్రీట్ చేస్తున్న విధానం వేరు , కామనర్స్ ని ట్రీట్ చేస్తున్న విధానం వేరుగా ఉందని మండిపడుతున్నారు. సెలబ్రిటీలు ఎంత పెద్ద తప్పు చేసినా స్మూత్ వార్నింగ్ లు ఇస్తూ వచ్చే నాగార్జున , సామాన్యులు చిన్న తప్పు చేసినా భూతద్దం లో చూపించి ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇక నిన్న రోహిత్ ని చూస్తే చాలామంది అయ్యో పాపం అని అనిపించింది. నిజానికి ఆ వీడియో ని అతన్ని నెగెటివ్ చెయ్యాలనే జనాలకు చూపించారు. కానీ సోషల్ మీడియా యుగం లో ఒకరిని ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ చేయడం , పాజిటివ్ చేయడం అంత తేలికైన విషయం కాదు.
అసలు విషయం ఏమిటంటే చరణ్ రోహిత్ వద్దకు వచ్చి ‘డ్యాగర్ ‘ ఎక్కడ దాచావు రా అని అడిగితే , నీ G లో దాచాను అని ఫన్నీ గా చరణ్ తో అంటాడు రోహిత్. అందుకు చరణ్ , నీకు ఇలా కాదు రా, ఈ వారం నిన్ను గెలుకుతూనే ఉంటాను, రెడ్ కార్డు ఇప్పిస్తాను చూడు అని చరణ్ అనగా , రోహిత్ నా వెంట్రుక కూడా పీకలేవు అనే గెస్చర్ చూపిస్తాడు. అది చరణ్ ని అన్నప్పటికీ కూడా , నాగార్జున బిగ్ బాస్ ని అన్నట్టుగా చూపించి, అతన్ని కనీవినీ ఎరుగని రేంజ్ లో టార్గెట్ చేసాడు. చరణ్ , రోహిత్ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. దాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో ని చూసిన తర్వాత మీకు కూడా నాగార్జున కావాలని రోహిత్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించిందో లేదో కామెంట్ చేయండి.\
మొదటి వారం నుండి ఈ వారం వరకు రోహిత్ ని టార్గెట్ చేసి ఎటాక్ చేయడమే బిగ్ బాస్ టీం పనిగా మారింది. ఆ క్రమం లో వాళ్ళు రోహిత్ ni కిందకు దించే బదులు జనాల్లో పై పైకి తీసుకెళ్తున్నారు. ఈ వారం లాగానే వచ్చే వారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తప్పు చెయ్యని వారంటూ ఎవ్వరూ ఉండరు. మిగిలిన కంటెస్టెంట్స్ లాగానే రోహిత్ కూడా చిన్న చిన్న తప్పులు చేస్తాడు. ఇతర కంటెస్టెంట్స్ చేసిన తప్పులను పెద్దగా టార్గెట్ చెయ్యరు , చూసి చూడనట్టు వదిలేస్తారు , కానీ రోహిత్ తుమ్మినా , దగ్గినా తప్పు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ఫ్యాన్స్ రాబోయే రోజుల్లో తమ గుండెల్ని ధైర్యం గా చేసుకొని నిలబడాలి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.