Thrigun: ఈ సీజన్ ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీ త్రిగున్ . ఈయన చాలా సినిమాల్లో హీరో గా నటించాడు, ఇతన్ని చూస్తే ఆడియన్స్ గుర్తు పట్టగలరు , కానీ పేరు చెప్తే మాత్రం గుర్తు పట్టలేరు. ఈయన అసలు పేరు ఆదిత్ అరుణ్, ఇండస్ట్రీ లోకి వచ్చిన కొన్నేళ్ళకు త్రిగున్ గా మార్చుకున్నాడు. అయితే ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన మొదటి వారం లోనే తనదైన మార్కు ఏర్పాటు చేసుకోవడం తో , ఈయన గురించి సోషల్ మీడియా లో నెటిజెన్స్ వెతకడం మొదలు పెట్టారు. అలా వెతగ్గా , ఈయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అందులో ముఖ్యంగా ఈయన పెళ్లి గురించి తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు నెటిజెన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.
గతం లో ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి త్రిగున్ మాట్లాడుతూ ‘నా భార్య పేరు నివేదిత. నా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకోవాలని , వెన్యూ ఫిక్స్ చేసి, భారీ మొత్తం లో అడ్వాన్స్ చెక్ కూడా కొన్ని ఫంక్షన్ హాల్స్ కి ఇచ్చేశాను. కానీ పెళ్లికి మూడు నెలల ముందు మా అమ్మ చనిపోయారు. దీంతో మేమంతా తీవ్రమైన దుఃఖం లో మునిగిపోయాము. మా అమ్మకి నేనొక్కడినే కొడుకు ని. మా అమ్మకి పెద్ద కోరికలు ఏమి లేవు, కేవలం నా పెళ్లి చూడాలని అనుకుంది. నేను ఆమె కోసం ఒక కారు కొనిచ్చాను , ఇల్లు కొనిచ్చాను , ఆమెకు ఇష్టమైన కుక్కలను కూడా కొనిచ్చాను , కానీ ఆమె వాటికి సంతోషపడలేదు. ఆమె సంతోషం కేవలం నా పెళ్లి లోనే ఉంది. అలాంటిది సరిగ్గా నాకు పెళ్లి కుదిరినప్పుడే చనిపోయింది’.
‘ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు , ఈ పెళ్లిని చాలా సింపుల్ గా చేసేసుకుందాం అని అందరం నిర్ణయించుకున్నాము. ఇండస్ట్రీ కి చెందిన అనేక మందికి కూడా నేను పెళ్లి చేసుకున్న విషయం తెలియదు. మంత్రి గా కొండా సురేఖ గారు ఎంపికైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినప్పుడు కూడా , ఆమెని నేను పెళ్ళికి పిలవలేదని అలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు త్రిగున్. ఇక నివేదిత విషయానికి వస్తే , ఈమె ఒక ఫేమస్ ఆర్కిటెక్ అట. తన ఇంటిని నిర్మించుకోవడం కోసం త్రిగున్ వాళ్ళ అమ్మనే త్రిగున్ కి పరిచయం చేసిందట. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి , ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఏడాది క్రితం ఒక బేబీ కూడా పుట్టింది. త్రిగున్ భార్య కి సంబంధించిన కొన్ని ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.