Pakistan Terror Camps: మీకు గుర్తుందా అప్పట్లో ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు భారత్ పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది.. ఈ ఆధారాలను ప్రపంచానికి చూపించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో.. ఇది నిదర్శనం అంటూ భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
ఈ విషయంలో అమెరికా పెద్దగా స్పందించలేదు. యూరప్ దేశాలు సైలెంట్ గా ఉన్నాయి. ఇక మిగతా దేశాలు ఏదో స్పందించాలి కాబట్టి స్పందించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం అందరికి తెలుసు. పైగా ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాడెన్ పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు. అప్పట్లో అమెరికా చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ద్వారా అతడు చనిపోయాడు. వాస్తవానికి ఈ విషయాలు మొత్తం ప్రపంచానికి తెలుసు. అమెరికాకు అంతకంటే తెలుసు. కానీ భారత్ మీద పెత్తనం సాగించాలి అంటే పాకిస్తాన్ సపోర్టు భారత్ కు అవసరం. పైగా భారత్ ను ఇబ్బంది పెట్టాలంటే పాకిస్తాన్ కచ్చితంగా ఉండాలి. అందువల్లే పాకిస్తాన్లో ఏం జరిగినా సరే అమెరికా నిశ్శబ్దంగా ఉంటుంది.
ఇక అప్పట్లో ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ పడగొట్టింది. అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ సహాయంతో వాటిని కూల్చివేసింది. అయితే ఆ భవనాలను ఇప్పుడు పాకిస్తాన్ పునరుద్ధరించింది. వాటి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆ భవనాలను పడగొట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు 25 కోట్ల రూపాయలను వాటి పునరుద్ధరణ కోసం కేటాయించింది. ఆ డబ్బులతో ఆ భవనాలను పునరుద్ధరించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు, పాలకుల మధ్య ఎంతటి బలమైన సంబంధం ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని జాతీయ వాదులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్లో తాగడానికి నీరు ఉండదు. తినడానికి తిండి ఉండదు. సరైన రోడ్లు ఉండవు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రజలకు ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం కూడా అందదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఆ దేశంలో.. ప్రజలు చెల్లించిన పన్నులు 25 కోట్లను ఉగ్రవాద శిబిరాల పునరుద్ధరణ కోసం ఖర్చు చేయడం పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితిని తేట తెల్లం చేస్తోంది.
ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు.. ఉగ్రవాదుల భవనాలు ధ్వంసమైనప్పుడు పాకిస్తాన్ మాట మాట్లాడలేదు. పైగా వాటిని ఉగ్రవాద శిబిరాలు అని పేర్కొనలేదు. నాడు జరిగిన ఈ ఘటనను దాచడానికి పాకిస్థాన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ ఆధారాలతో బయటపెట్టింది.. చివరికి ఆ భవనాలను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టడం విశేషం. ఈ చర్య ద్వారా తమను.. ఉగ్రవాదాన్ని వేరువేరుగా చూడలేరని.. తాము సయా మీ కవలలమని పాకిస్తాన్ పాలకులు నిరూపించారు.