Vaibhav suryavamshi tears: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో యువ ఆటగాడు వైభవ్ సూర్య వంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఢిల్లీ నగరంలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అయితే తుది జట్టులో వైభవ్ కు చోటు దక్కలేదు.
వైభవ్ కు స్థానం కల్పించకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం అయింది. అయితే బుడ్డోడి ప్లేస్ లో సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు. అభిషేక్ శర్మతో కలిసి సంజు ఓపెనింగ్ ఆటగాడిగా వచ్చాడు.
సూర్య వంశీ గడిచిన ఐపిఎల్ లో అదరగొట్టాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో అతడు అంతగా ఆకట్టుకోలేదు. జింబాబ్వే టూర్ లో మాత్రం దుమ్మురేపాడు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో అతడికి అవకాశం వస్తుందని అందరూ ఆశించారు. కానీ మేనేజ్మెంట్ జట్టు కాంబినేషన్ లో సరికొత్త విధానానికి పాల్పడడంతో.. సూర్య వంశీని పక్కన పెట్టింది. అంతేకాదు కాంబినేషన్లో భాగంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కెప్టెన్ అయ్యర్ వెల్లడించాడు.
మ్యాచ్ ప్రారంభ నేపథ్యంలో కొన్ని కెమెరాలు సూర్య వంశీ ని క్లోజప్ లో చూపించాయి. దీంతో అతడు తీవ్రమైన నిరసన కనిపించాడు. తుది జట్టులో అవకాశం దక్కకపోవడంతో వైభవ్ ముఖంలో బాధ కనిపించింది. ఆ బుడ్డోడి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అతడు ఎంతగానో ఎదగాలని కోరుకుంటున్నాప్పటికీ గంభీర్ తొక్కేస్తున్నాడని.. ఇలా చేయడం అతనికి ఏమైనా న్యాయమా అంటూ క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సూర్య వంశీ కోసమే తాము ఓటిటిలను సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నామని.. సూర్య వంశీని ఆడించకపోవడం పట్ల సబ్స్క్రిప్షన్ బొక్క అని కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా మొత్తం సూర్య వంశీ నామ జపం చేస్తున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ రెండవ మ్యాచ్లో అయినా అతడికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. సూర్య వంశీకి అవకాశాలు కల్పించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. బుడ్డోడిని ఇలా ఏడిపించడం ఏమాత్రం కరెక్ట్ కాదని.. గౌతమ్ గంభీర్ తన నిర్ణయం విషయంలో ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు.
VAIBHAV SOORYAVANSHI IS SAD !
– Despite his brilliant IPL performance, Vaibhav Sooryavanshi was not included in the playing XI for the first T20I against Afghanistan.
– When the camera focused on him, he looked visibly sad and disappointed.
– He appeared to be deeply hurt… pic.twitter.com/fKeI93hQPm— lndian Sports Network (@IS_Netwrk29) September 13, 2026