Nasser Son : హీరో అవ్వాల్సిన నాజర్ కుమారుడు ఇలా జీవచ్ఛవంలా ఎలా మారాడు.. ఏమైందసలు?

విజయ్ ని చూసిన ఆయన చాలా సంబరంతో ఉన్నట్టుగా నాజర్ తెలియజేశాడు… ఇలా నాజర్ తన కొడుకుని చూస్తూ చాలా నరకం అనుభవిస్తున్న కూడా ఆయన ఎక్కడ తన భాద ని బయటికి చెప్పుకోడు…

  • Written By: NARESH
  • Published On:
Nasser Son : హీరో అవ్వాల్సిన నాజర్ కుమారుడు ఇలా జీవచ్ఛవంలా ఎలా మారాడు.. ఏమైందసలు?

Follow us on

Nasser Son : తెలుగు, తమిళ ఇండస్ట్రీ లో నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో నాజర్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమా లు ఇండస్ట్రీ లో మంచి విజయాలు అందుకున్నాయి. మొదట గా ఈయనని ఇండస్ట్రీ కి బాలచందర్ గారు తీసుకురావడం జరిగింది.ఇక ఈయన వరుసగా తమిళ్, తెలుగు లో నటిస్తూ నటుడి గా చాలా బిజీగా ఉంటున్నాడు.ఈయన చేసిన మాతృదేవోభవ సినిమాతో తెలుగు మంచి గుర్తింపు ని పొందాడు ఇక అప్పటి నుంచి తెలుగు లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ నటుడు గా మారిపోయాడు….ఇక నిజానికి ఈయన తెలుగు లో చాలా మంది స్టార్ హీరోలతో కూడా నటించాడు. ఏ పాత్రలో అయిన అవలీల గా నటించి మెప్పించే అతి కొద్దీ మంది నటులలో నాజర్ ఒకరు. ఈయన చేసిన ప్రతి పాత్ర కూడా ఈయన తప్ప ఎవరూ చేయలేరు అనేంతలా నటించి మెప్పిస్తారు ఆయన…

సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరో గా వచ్చిన వన్ నేనెక్కడినే సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆ క్యారెక్టర్ లో గొప్ప గా నంటించి మెప్పించారు. ఇక ఈయన ఒక విలక్షణ నటుడు అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి అయితే లేదు అలాంటి ఈ నటుడి జీవితం లో చాలా భాదలు కూడా ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఒకసారి చూసుకుంటే ఆయనకి ముగ్గురు కొడుకులు నూరుల్ హజన్, లుఫ్తిన్,అభి మెహ్తీ హసన్ ఉన్నారు.అయితే వీళ్ళ ముగ్గురిని నాజర్ ఇండస్ట్రీ లోనే హీరోలుగా చేయాలని అనుకున్నాడు కానీ అతని పెద్దకొడుకు తప్ప మిగిలిన ఇద్దరు హీరోలు గా మారారు.ప్రస్తుతం వీళ్లు సినిమాల్లో నటిస్తున్నారు ఇక ఈయన పెద్ద కొడుకు విషయం లోనే విధి వీళ్లతో వింత నాటకం ఆడిందనే చెప్పాలి.ఎందుకంటే నాజర్ పెద్ద కొడుకు అయిన నూరుల్ హజన్ అలియాస్ అబ్దుల్ ఫైజల్ హాసన్ కి చిన్నప్పటి నుంచి నాజర్ లాగానే ఇండస్ట్రీ లో ఒక మంచి నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ ఉండేది. ఆయన ఇంట్రెస్ట్ ని గుర్తించిన నాజర్ కూడా ఆయన ఇష్టాన్ని కాదనలేకపోయాడు అందుకే ఆయనను హీరో గా పెట్టీ ఒక సినిమా తీసి ఆయన్ని ఇండస్ట్రీ కి పరిచయం చేద్దాం అనుకున్న టైమ్ లో ఆయనకి యాక్సిడెంట్ అవడం దాని వల్ల ఆయన చనిపోలేదు, కానీ బతికి ఉన్న జీవచ్చవం లా మారిపోయాడు అనే చెప్పాలి.

ఆయన కూర్చునే ఉంటాడు లేవడం, నడవడం లాంటివి ఏం చేయడు అలాగే ఇంట్లో ఉన్న నాజర్ ని అతని భార్య ని కూడా గుర్తుపట్టలేడు ప్రస్తుతం ఆయన పరిస్థితి అలా దారుణంగా మారిపోవడం తో ఆయన గురించి తెలిసిన అందరూ కూడా చాలా భాద పడుతున్నారు. అలాగే నాజర్ అంత భాదని అనుభవిస్తూ కూడ సినిమాల్లో నటిస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అంటూ చాలా మంది ఆయన సన్నిహితులు సిని అభిమానులు సైతం వాళ్ల సానుభూతిని తెలియజేస్తున్నారు… అయితే నాజర్ కొడుకు అయిన నూరుల్ హజన్ ఎవ్వరిని గుర్తు పట్టకపోయిన తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ ని మాత్రం గుర్తుపడతాడు మొదటి నుంచి కూడా ఆయనకి విజయ్ అంటే చాలా ఇష్టం అంటా అందుకే విజయ్ సినిమా టీవీలో వచ్చినప్పుడు ఆయన్ని చూసినప్పుడు చాలా సంతోషం తో కేరింతలు వేసాడట అయితే ఈ విషయాన్ని ఒక రోజు షూటింగ్ లో నాజర్ విజయ్ తో చెప్పగా ఈ ఇయర్ ఆయన బర్త్ డే వేడుకలకి విజయ్ వచ్చి ఆయనతో కొద్ది సేపు స్పెండ్ చేయడం జరిగింది.దీంతో విజయ్ ని చూసిన ఆయన చాలా సంబరంతో ఉన్నట్టుగా నాజర్ తెలియజేశాడు… ఇలా నాజర్ తన కొడుకుని చూస్తూ చాలా నరకం అనుభవిస్తున్న కూడా ఆయన ఎక్కడ తన భాద ని బయటికి చెప్పుకోడు…

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు