Mukesh Ambani: 100 కోట్ల ఆదాయం ఉన్న వరుడు కావాలి అంటూ యువతి పోస్ట్.. సరైన రిప్లై ఇచ్చిన ముకేశ్ అంబానీ..!

ముఖేష్ అంబానీ పూజ వేసిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతను ఆలోచనలకు గురిచేస్తుంది. యువత కలల్లో విహరిస్తూ నేల మీద సాము చేస్తున్నారని, గమ్యం లేని ప్రయాణాన్ని సాగిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారన్న అర్థం వచ్చేలా ముఖేష్ అంబానీ ఈ విధంగా రిప్లై ఇచ్చారంటూ పలువురు పేర్కొంటున్నారు. ముఖేష్ అంబానీ అలా ఆలోచించబట్టే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడిగా స్థిరపడ్డారని, ఏటా తన ఆస్తులను పెంచుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. దేశంలో ఎంతో మంది యువత ఈ తరహా ఆలోచనలు కలిగి ఉండి సమయాన్ని వృధా చేసుకుంటున్న విషయాన్ని ఈ పోస్టు ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశారు.

  • Written By: BS
  • Published On:
Mukesh Ambani: 100 కోట్ల ఆదాయం ఉన్న వరుడు కావాలి అంటూ యువతి పోస్ట్.. సరైన రిప్లై ఇచ్చిన ముకేశ్ అంబానీ..!

Follow us on

Mukesh Ambani: సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు ఆసక్తిని కలిగిస్తుంటాయి. సాధారణ వ్యక్తులు పెట్టే పోస్టులకు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సమాధానాలు ఇస్తుంటారు. ఈ తరహా సమాధానాలు ఎక్కువగా మహేంద్ర సంస్థల అధినేత ఆనందమహేంద్ర నుంచి ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఆయన సామాజిక మాధ్యమాల్లో యమా యాక్టివ్ గా ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పెట్టిన పోస్ట్ కు సరైన రిప్లై ఇచ్చారు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ ఇచ్చిన ఆ సమాధానాన్ని చూసిన నెటిజన్లు.. అందుకే ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ధనికుడిగా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి పెట్టిన కామెంట్ ఏంటి..? దానికి ముఖేష్ అంబానీ ఇచ్చిన సమాధానం ఏంటో మీరు చదివేయండి.

పూజ అనే ఒక అమ్మాయి తన సామాజిక మాధ్యమంలో పలువురికి షేర్ చేస్తూ.. ఇలా రాసుకు వచ్చింది. నేను ధనవంతుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే టైటిల్ తో సదరు పూజ అనే యువతి ఇలా రాసుకుంది. ‘ నా వయసు 25 ఏళ్లు. నా పేరు పూజ చౌహాన్. నేను చాలా అందంగా ఉంటాను. నాకు చాలా మంచి అభిరుచులు ఉన్నాయి. నాకు ఏడాదికి 100 కోట్లకు మించిన వేతనం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఉంది. నాది అత్యాశ కాదు. ప్రస్తుతం ఏడాదికి రెండు కోట్లు సంపాదిస్తున్న వారు కూడా మధ్యతరగతి వారే. నేను నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతున్నాను. నేను డేటింగ్ చేసిన వారిలో రూ.50 కోట్లు ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు మాత్రమే ఉన్నారు. అది నాకు సరిపోదు. న్యూయార్క్ సిటీ గార్డెన్ పశ్చిమ ప్రాంతంలో ఓ నివాస గృహాన్ని కొనాలంటే రూ.50 కోట్ల ఆదాయం సరిపోదు. అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్న వీటికి సమాధానం తెలిస్తే చెప్పండి. ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు..?, ఏ వయసు వారిని నేను లక్ష్యంగా చేసుకోవాలి.?, ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారు ఎందుకు.? నేను చూసిన వారిలో అందం తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది ధనవంతులను పెళ్లి చేసుకున్నారు ఇందుకు కారణం ఏమిటి..? ఎవరినైనా చూస్తే భారీగా చేసుకోవాలని ఏ కారణాలతో అనిపిస్తుంది.? స్నేహితురాలుగా ఎవరిని ఉంచుకుంటారు.? నా టార్గెట్ మాత్రం పెళ్లి చేసుకోవడమే..? అంటూ పూజ అనే యువతి ట్విట్టర్ ఖాతాలో రాసుకు వచ్చింది. అనూహ్యంగా దీనికి ముఖేష్ అంబానీ సమాధానాన్ని ఇచ్చారు. ఆ సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారి తెగ వైరల్ అవుతుంది.

ముఖేష్ అంబానీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే..?

ముకేశ్ అంబానీ సదరు యువతి పోస్టుకు ఇలా సమాధానం ఇచ్చారు. ‘ ప్రియమైన పూజ. నీ పోస్టును ఆసక్తిగా చదివాను. నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. నా వార్షికాదాయం రూ.100 కోట్లపైనే. ఇది నీ రిక్వైర్మెంట్ కు సరిపోతుంది. కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృధా చేసుకోవడం లేదు. ఓ వ్యాపారవేత్తగా నిన్ను వివాహం చేసుకోవడం నాది రాంగ్ డెసిషన్ అవుతుంది. దీనికి సులువైన ఆన్సర్ నా వద్ద ఉంది. నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. ఎక్కడ ప్రధానమైన సమస్య ఉంది. ఏమిటంటే.. నీ అందం రోజురోజుకు జరిగిపోతుంది. నా ఆదాయం ఓ సరైన కారణం లేకుండా తగ్గదు. పైగా ఏటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. నీ అందం గడిచే కొద్ది తగ్గుతుంది. ఇక ఫైనాన్షియల్ గా చూస్తే నాది పెరిగే ఆస్తి. నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్టంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఇదే నీ వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే.. ప్రతి ట్రేడింగ్ కు ఓ పొజిషన్ ఉంటుంది. డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పొజిషనే. ట్రేడ్ విలువ పడిపోతుంటే దాన్ని దీర్ఘకాలం దగ్గరే ఉంచుకోవడం మంచి ఆలోచన అనిపించుకోదు. నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే అది మంచి ఆలోచన ఎంత మాత్రం కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి. ఎవరికైనా 100 కోట్ల ఆదాయం వస్తుందంటే అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలేసి ముందుగా రూ.100 కోట్లు ఎలా సంపాదించాలన్నది ఆలోచించు. అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు.

యువతను ఆలోచనలకు గురిచేస్తున్న ముకేశ్ అంబానీ రిప్లై..

ముఖేష్ అంబానీ పూజ వేసిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతను ఆలోచనలకు గురిచేస్తుంది. యువత కలల్లో విహరిస్తూ నేల మీద సాము చేస్తున్నారని, గమ్యం లేని ప్రయాణాన్ని సాగిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారన్న అర్థం వచ్చేలా ముఖేష్ అంబానీ ఈ విధంగా రిప్లై ఇచ్చారంటూ పలువురు పేర్కొంటున్నారు. ముఖేష్ అంబానీ అలా ఆలోచించబట్టే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడిగా స్థిరపడ్డారని, ఏటా తన ఆస్తులను పెంచుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. దేశంలో ఎంతో మంది యువత ఈ తరహా ఆలోచనలు కలిగి ఉండి సమయాన్ని వృధా చేసుకుంటున్న విషయాన్ని ఈ పోస్టు ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశారు.

ముఖేష్ అంబానీ రిప్లై వెనుక నిజం ఎంత..

ఈ పోస్టు ఎంతవరకు వాస్తవం అన్నదే తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పటికప్పుడు తిరుగుతున్న పోస్ట్ అయినప్పటికీ అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ పోస్టు ఎవరో ఒక వ్యక్తి ఊహల్లో నుంచి వచ్చినదిగా చెబుతున్నారు. కానీ ముకేశ్ అంబానీ వంటి వ్యక్తి ఇచ్చిన సమాధానంగా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడంతో దీనికి కాస్త ఎక్కువ విలువ పెరిగింది. ఎందుకంటే ముకేశ్ అంబానీ ఇలాంటి వ్యక్తి నేరుగా ఇలా సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వెచ్చించడం కుదరదు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను నిపుణులతో కూడిన బృందం పర్యవేక్షిస్తుంది. నెటిజెన్లు పెట్టే పోస్టులకు రిప్లై ఇచ్చే అంత ఖాళీ కూడా అంబానీకి లేదు. కానీ ఆయన పేరుతో ఈ పోస్టు వైరల్ అవుతుండడంతో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖేష్ అంబానీ యువతి పోస్టుకు సమాధానం ఇచ్చినా, ఇవ్వకపోయినా.. ఆయన పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ మాత్రం యువతకు మంచి సందేశాన్ని ఇచ్చేదిగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు