Office Mistakes :ఒక సంస్థ లేదా కంపెనీలో కొంతమంది ఉద్యోగులు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. తమది కేవలం విధులు మాత్రమే కాకుండా సొంత కంపెనీలా చూసుకుంటారు. అయితే ఇలా అతిగా కష్టపడిన వారు తమ పని గురించి ఇతరులకు తెలియజేయడంలో విఫలమవుతుంటారు. దీంతో వీరికి సరైన గుర్తింపు రాకుండా ఉంటుంది. ఫలితంగా వీరు ఎంతో కాలంగా ఉన్నచోటే ఉండిపోతారు.. ఉన్నత స్థాయికి వెళ్లరు. మరి ఇలాంటివారు ఏం చేయాలి?
ఒక ఉద్యోగి పనితీరు ఆ టీం లీడర్ లేదా మేనేజర్ కు మాత్రమే తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఇతరులకు తెలియజేయడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినప్పుడు తమ గురించి తెలియ చెప్పడం ద్వారా మిగతావారు గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి మీ వంతు కృషి చేయడం వల్ల అది సక్సెస్ అయితే అది తమ వల్లే అన్నట్లు చెప్పుకోవాలి. దీంతో భవిష్యత్తులో సమస్య పరిష్కారానికి మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది.
ఒక ఉద్యోగి ఎక్కువగా మేనేజర్ తోనే కమ్యూనికేట్ అయి ఉంటాడు. ఇలాంటి అప్పుడు ఆ మేనేజర్ తో సంయమనం పాటించాలి. అతను చెప్పినా ప్రతి పని చేయమని కాదు.. కానీ అతని వర్క్ నువ్వు కంప్లీట్ చేయడంలో సీరియస్ ఉండాలి. అంతేకాకుండా అతనికి గుర్తింపు వచ్చే విధంగా మీ పనితీరు ఉంటే ఇద్దరికీ ఉపయోగపరంగా ఉంటుంది. అంతేకాకుండా టీం లీడర్ ఏదైనా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే దాన్ని పూర్తి చేయడంలో ఉద్యోగి ఎక్కువగా కష్టపడితే భవిష్యత్తులో అతనికి ప్రమోషన్ విషయంలో సహాయపడే అవకాశం ఉంటుంది.
ప్రతి ఉద్యోగి ఏదోరకంగా విజయాలు సాధించే ఉంటాడు. కానీ వాటిని డబ్బా కొట్టుకోవడం ఎందుకు? అని కొందరు అనుకుంటారు. కానీ తమ విజయాలను రికార్డు చేసుకొని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తే ప్రత్యేకంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు అవసరమైన శక్తి అందుతుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు వచ్చినా ప్రశంసలు కూడా మరో పని చేయడానికి బలం చేకూరుతుంది.
కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాల్లో మౌనంగా ఉండడం వల్లభారి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే వాక్యాతుర్యంతో అక్కడున్న వారందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఫలితంగా అప్పటివరకు టీం లీడర్ కు మాత్రమే తెలిసిన ఉద్యోగి కంపెనీ మొత్తం తెలిసిపోతుంది. దీంతో కొన్నిసార్లు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే ప్రతి ఉద్యోగికి విజయాలు ఉంటాయని అనుకోలేం. అందుకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతే ఎప్పుడైనా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన విజయమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది.