Homeబిజినెస్Hard Work : 'కఠిన శ్రమ విలువను గుర్తిస్తుంది.. కానీ ఆ శ్రమను ప్రదర్శిస్తేనే గుర్తింపు...

Hard Work : ‘కఠిన శ్రమ విలువను గుర్తిస్తుంది.. కానీ ఆ శ్రమను ప్రదర్శిస్తేనే గుర్తింపు వస్తుంది.

Hard Work : ప్రపంచంలో చాలామంది మేధావులు ఉంటారు. వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఏదైనా సాధించాలని అనుకుంటారు. అయితే చాలామందికి కఠిన శ్రమతో కష్టపడడం తెలుసు. కానీ వారు తమ ఫలితాన్ని ఎదుట ప్రదర్శించలేరు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు సైలెంట్ గా ఎన్నో రకాల క్రియేటివిటీలు చేస్తుంటారు. అయితే తమకు ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుందని కామ్ గా ఉంటారు. తమ తమ పని గురించి ఇతరులకు తెలపడం వల్లే గుర్తింపు వస్తుంది. అది […]

Hard Work : ప్రపంచంలో చాలామంది మేధావులు ఉంటారు. వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఏదైనా సాధించాలని అనుకుంటారు. అయితే చాలామందికి కఠిన శ్రమతో కష్టపడడం తెలుసు. కానీ వారు తమ ఫలితాన్ని ఎదుట ప్రదర్శించలేరు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు సైలెంట్ గా ఎన్నో రకాల క్రియేటివిటీలు చేస్తుంటారు. అయితే తమకు ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుందని కామ్ గా ఉంటారు. తమ తమ పని గురించి ఇతరులకు తెలపడం వల్లే గుర్తింపు వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఏదేని రంగంలోని ఒక ఉద్యోగి కఠిన శ్రమ ద్వారానే ఆ సంస్థ లేదా కంపెనీ గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ ఓవరాల్గా కంపెనీ యాజమాన్యానికి మాత్రమే పేరు వస్తుంది. అయితే ఇక్కడ ఎన్నో రాత్రులు శ్రమపడి అనేక క్రియేటివిటీలు సాధించిన వారు తమ పని గురించి ఇతరులకు చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా తమను ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకప్పుడు గుర్తిస్తూ ఉంటారని అనుకుంటారు. కానీ ఏ ఉద్యోగి అయినా తాను చేసిన పని గురించి సరైన విధంగా వివరించకపోతే ఎప్పటికైనా నష్టపోయేది తానే..

ఒక ఉద్యోగం చేసిన పనిని చెప్పుకోవడం అంటే.. సొంత డబ్బా కొట్టుకోవడం కాదు. తాను ఏ రకంగా కష్టపడ్డాడు? తాను ఒక పని చేసే సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయి? తాను చేసిన పని వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అంతేకాకుండా భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని సంబంధిత మేనేజర్ తో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన సమావేశంలో అవకాశం వస్తే తమ గురించి లేదా సంస్థ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వాయిస్ ఇస్తూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల కష్టపడిన దానికి సరైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వీరికి పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. ఎందరో కంపెనీ యజమానులు కింది నుంచి వచ్చిన వారే. చాలామంది వీరిలో తాము చేసే పని గురించి సరైన విధంగా ఇతరులకు చెప్పడం వల్లే వారిలోనే నైపుణ్యాన్ని కంపెనీలు గుర్తించి వారికి సరైన విధంగా న్యాయం చేయగలిగారు. దీంతో అటు ఉద్యోగి.. ఇటు కంపెనీ రెండూ అభివృద్ధి సాధించగలిగాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు తమ పని గురించి ఎదుటివారికి సరైన విధంగా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే సంవత్సరాలు గడిచినా కూడా వారి కష్టానికి ఎలాంటి గుర్తింపు ఉండకుండా పోతుంది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper