Chiranjeevi And Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుండటం శుభ పరిణామం అనే చెప్పాలి. ఒకరకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు కృషి చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు ముందుండి ఇండస్ట్రీని నడిపించే ప్రయత్నం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ను తనకు వివరించడానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరు కలిసి వెళ్లారు. ఇక ఈ క్రమంలోనే మురళీమోహన్ ని కూడా రమ్మన్నారట. అప్పటికే మురళీమోహన్ కి రాజశేఖర్ రెడ్డి కి మధ్య కొంతవరకు వైరమైతే ఉంది. దాంతో మురళీమోహన్ నేను వస్తే రాజశేఖర్ రెడ్డి మూడు స్పాయిల్ అవుతుంది. ఆయన సరిగా రెస్పాండ్ అవ్వడని చెప్పాడట. అయినప్పటికి మీరు రావాల్సిందే అని వీళ్ళందరూ అడగడం తో సరే వస్తాను కానీ నేను వెనకాల ఎక్కడో కూర్చుంటానని చెప్పారట.
వాళ్ళకి చెప్పినట్టుగానే ఆయన ఎక్కడో వెనకాల కూర్చున్నాడు. ఇక ఇండస్ట్రీ పెద్దలందరు కలిసి రాజశేఖర్ రెడ్డి తో మాకు కొంత స్థలం కావాలి ఇండస్ట్రీ కి సంబంధించిన కొన్ని భవనాలను నిర్మించుకోవాలని అడిగారట. దాంతో రాజశేఖర్ రెడ్డి మురళీమోహన్ ని చూస్తూ ఆయన గారి దగ్గర మీ అందరికీ సరిపడ భూములు ఇచ్చే అంత కెపాసిటి ఉంది.
ఆయన ఉండగా మీరు నన్ను ఎలా అడుగుతున్నారు అంటూ ఆయన మురళి మోహన్ మీద సెటైర్ వేసి తప్పించుకున్నారట. మొత్తానికైతే అక్కడ ఉన్న వాళ్ళందరు ఏం చేయాలో తెలియక ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు. ఇక చివరగా అందరు కలిసి వెళ్లిపోతున్న క్రమంలో రాజశేఖర్ రెడ్డి గారిని పిలిచి ఒక ఫోటో దిగుదామని చెప్పినప్పటికి ఆయన టైం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట.
అక్కడ చిరంజీవి, నాగార్జున, నాగేశ్వర రావు లాంటి స్టార్లు ఉన్నారు.ఆయన వాళ్ళందరిని ఇన్సల్ట్ చేశాడు అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు… మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…