Homeలైఫ్ స్టైల్Good Employee: మంచి ఉద్యోగి ‘నో’ ఎందుకు చెప్పాలి? లేకుంటే ఏమవుతుంది?

Good Employee: మంచి ఉద్యోగి ‘నో’ ఎందుకు చెప్పాలి? లేకుంటే ఏమవుతుంది?

Good Employee: ఒక సంస్థలో ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తూ.. ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని తీసుకుని అద్భుతంగా పనిచేసే ఉద్యోగులను మేనేజర్లు సాధారణంగా ‘బెస్ట్ ఎంప్లాయీస్’గా గుర్తిస్తారు. అయితే ఇదే పేరు కొన్నిసార్లు ఆ ఉద్యోగులకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే పని బాగా చేస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతి కొత్త పని లేదా అత్యవసర ప్రాజెక్ట్ లేదా ఇతరుల పెండింగ్ పనులు కూడా వారికే అప్పగించే పరిస్థితి ఏర్పడొచ్చు. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు కూడా […]

Good Employee: ఒక సంస్థలో ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తూ.. ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని తీసుకుని అద్భుతంగా పనిచేసే ఉద్యోగులను మేనేజర్లు సాధారణంగా ‘బెస్ట్ ఎంప్లాయీస్’గా గుర్తిస్తారు. అయితే ఇదే పేరు కొన్నిసార్లు ఆ ఉద్యోగులకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే పని బాగా చేస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతి కొత్త పని లేదా అత్యవసర ప్రాజెక్ట్ లేదా ఇతరుల పెండింగ్ పనులు కూడా వారికే అప్పగించే పరిస్థితి ఏర్పడొచ్చు. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొన్నింటికి ‘నో’ చెప్పాలని నిపుణులు అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నో చెప్పాలి?

ఒక వ్యక్తికి మంచి ఉద్యోగి అని గుర్తింపు వచ్చిన తరువాత ‘నో’ చెప్పడం చాలా కష్టమైన పని. నో చెప్పడం అంటే ఆ పని నుంచి తప్పించుకోవడం అని అనుకుంటారు.కానీ కొన్ని సందర్భాల్లో దీనిని చెప్పక తప్పదు. ఒక ఉద్యోగి ఇప్పటికే మూడు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటే, నాలుగో ప్రాజెక్టును కూడా ఎలాంటి చర్చ లేకుండా అంగీకరించడం వల్ల అన్ని పనుల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైన సందర్భంలో ‘ఇది చేయగలను.. కానీ ప్రస్తుతం ఉన్న పనుల్లో దేనికి ప్రాధాన్యత తగ్గించాలి?’ అని మేనేజర్‌ను అడగడం ప్రొఫెషనల్ విధానం.

ప్రతి పనికీ ‘ఎస్’ చెబుతూ పోతే మొదట్లో మేనేజర్‌కు ఆ ఉద్యోగి అంకితభావంతో కలిగి ఉన్నాడని అనుకోవచ్చు. కానీ కాలక్రమేణా అదే అదనపు బాధ్యతలకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఇతర ఉద్యోగులు చేయాల్సిన పనులను కూడా పదేపదే ఆ ఉద్యోగిపై భారం వేయడం వల్ల టీమ్‌లో పని పంపిణీ అసమతుల్యంగా మారుతుంది. హై పెర్ఫార్మర్లను ఎప్పటికప్పుడు ఇతరుల లోటును భర్తీ చేయడానికి ఉపయోగించడం వారి శక్తి, ఉత్సాహాన్ని తగ్గించవచ్చని నాయకత్వ మార్గదర్శకాలు హెచ్చరిస్తున్నాయి.

ఒక ఉద్యోగి నమ్మకంగా.. వేగంగా.. తక్కువ పర్యవేక్షణతో పని పూర్తి చేస్తుంటే.. మేనేజర్‌కు అతనిపై సహజంగానే నమ్మకం పెరుగుతుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులు, క్లిష్టమైన పనులు, అత్యవసర బాధ్యతలు అతనికే అప్పగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, జూనియర్ ఉద్యోగులకు మార్గనిర్దేశం చేయడం, ఇతరుల పనిని చెక్ చేయడం వంటి అదనపు బాధ్యతలు కూడా బెస్ట్ ఎంప్లాయీపై పడొచ్చు. హై పెర్ఫార్మర్లకు వరుసగా కఠినమైన ప్రాజెక్టులు, అదనపు పనులు ఇవ్వడం వల్ల వారు ఓవర్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణుల గైడ్‌లు పేర్కొంటున్నాయి.

ఈ పని ఇతనికి ఇస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తాడు అనే నమ్మకం మేనేజర్‌కు ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకం కారణంగా ప్రతి పనిని ఒకే ఉద్యోగికి అప్పగించడం మాత్రం ప్రమాదకరం. ఒక దశలో ఆ ఉద్యోగి కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయడానికే సమయం కేటాయించాల్సి రావచ్చు. దీంతో కెరీర్ గ్రోత్, క్రియేటివిటీ, కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా తగ్గవచ్చు.

ఇలాంటి సమయంలో ఒక ఉద్యోగి కొత్త పని వచ్చినప్పుడు ఇప్పటికే ఉన్న పనులపై దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. అవసరమైతే మేనేజర్‌తో వర్క్‌లోడ్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలి. ముఖ్యంగా అదనపు పని వల్ల నాణ్యత, డెడ్‌లైన్ లేదా ఇప్పటికే ఉన్న బాధ్యతలు ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ముందుగానే చెప్పాలి. మేనేజర్లు కూడా టీమ్ సభ్యుల సామర్థ్యాన్ని క్రమం తప్పకుండా తెలుసుకుని, పనిభారాన్ని సమానంగా పంపిణీ చేయాలని నిపుణుల మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper