Job Promotion Tips: ఒక సంస్థ లేదా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కేవలం ఆదాయాన్ని పొందడమే కాకుండా అత్యంత స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే ఉన్న స్థాయి కంటే పై స్థాయికి వెళ్లడం వల్ల ఎక్కువగా జీవితం రావడమే కాకుండా అధికారం, హోదా, గౌరవం లభిస్తాయి. ఇదే సమయంలో కొన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అందువల్ల చాలామంది ఉద్యోగులు పదోన్నతి కోసం నిత్యం కష్టపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనకంటే తర్వాత కార్యాలయాల్లోకి వచ్చిన వారికి ప్రమోషన్ వస్తుంది. ఇలాంటి అప్పుడు మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? మనకెందుకు ప్రమోషన్ రాలేదు? అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే?
పదోన్నతి కావాలంటే కేవలం సిన్సియర్గా వర్క్ చేయడమే కాకుండా ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సంస్థలో మేనేజర్ తన కింది స్థాయి ఉద్యోగి విషయంలో అన్ని రకాలుగా పరిశీలన చేస్తాడు. అతను ఎంత కష్టపడి పని చేసినా.. ఆ తర్వాత పనిని ఎలా చేయగలడు? అతనికి అదనపు బాధ్యతలు ఇస్తే సరైన విధంగా నిర్వహించగలడా? అన్న విషయంపై ఆలోచిస్తారు. అయితే ఒకవేళ తనకు పదోన్నతి వస్తే ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుందో.. ముందుగానే తన మేనేజర్ కు తన పనితీరును ప్రదర్శించాలి. అలాంటప్పుడు తనపై నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తొందరగా పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతి ఉద్యోగి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా అవసరం. ఎంత అప్డేట్ ఉంటే అంత ఆదరణ పొందుతారు. ఇలా అప్డేట్ ఉండే వారిని మేనేజర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల చెప్పిన పనినే కాకుండా అదనపు పనిని కూడా చేయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా కొత్త విషయాలను అవగాహన చేసుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలి. ఇది చూసిన మేనేజర్ తనకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాడు అని భావిస్తాడు. దీంతో తొందరగా పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
కార్యాలయంలో కేవలం పని మాత్రమే కాకుండా గౌరవం పొందేలా చూసుకోవాలి. అందుకోసం సత్ప్రవర్తన అలవర్చుకోవాలి. ఇతరులతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం.. సీనియర్లు చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడం.. ఎలాంటి ప్రాబ్లమ్స్ సృష్టించకుండా.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వంటివి నేర్చుకోవాలి. దీంతో భవిష్యత్తులో వచ్చే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలుగుతాడని నమ్మకం ఏర్పడుతుంది.
ఇవే కాకుండా తోటి వారితో నిత్యం సంతోషంగా ఉంటూ.. పనిలో సీరియస్నెస్ ఉండాలి. దీంతో అదనపు బాధ్యతలు ఇచ్చి పరిశీలన చేస్తారు. ఈ బాధ్యతలను పూర్తిచేస్తే పదోన్నతి వచ్చే అవకాశాలుంటాయి. సంస్థలో అప్పుడప్పుడు అదనపు పనులు కూడా ఉంటాయి. కొందరు వీటిని చేయడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి సమయంలో ownup చేసుకొని ఆ పనిని పూర్తిచేస్తే అప్పుడు నమ్మకం కలిగి పదోన్నతి వచ్చే అవకాశాలుంటాయి.